YV Subba Reddy: ఏపీ రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..


ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, ప్రత్యేక హోదా అంశాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వైజాగ్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామన్నారు సుబ్బారెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా రాజధాని నిర్మాణం పూర్తికాలేదన్నారు. పైగా ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని.. వాస్తవ పరిస్థితుల్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు. ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. జూన్‎తో రాజధాని గడువు ముగియనుండటంతో మరికొన్ని రోజులు పొడగించాలని కోరుతామన్నారు.

See also  Teacher Logo – Fact check -టీచర్స్ లోగోను సుప్రీంకోర్టు ఆమోదించిందా.. ఇదీ నిజం..!
,