ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి… హిందూ శాస్త్రంలో ఎందుకు అంత ప్రాముఖ్యత


హిందూధర్మంలోని ఆచారాల ప్రకారం ఏదైనా దేవాలయంలో దేవుని విగ్రహ ప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించకుంటే దేవుని ఆరాధన అసంపూర్ణమవుతుందని అంటారు.
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న రామ్‌లల్లా విగ్రహానికి ‍ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఇందులోని విశిష్టత ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. . .

యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న మధుర క్షణాలు అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసమే. ఎన్నో ఏళ్ల కల జనవరి 22న నెరవేరనుంది. అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టాపన జరగనుంది

హిందూ మతంలో ప్రాణ ప్రతిష్ఠ అనేది పవిత్రమైన వేడుక. ఆలయంలో ఏర్పాటు చేసే విగ్రహంలోకి దేవతని ఆహ్వానించడం. కొత్తగా ఆలయం నిర్మించినప్పుడు లేదా కొత్తగా విగ్రహాన్ని పెడుతున్నప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. వేద మంత్రోచ్చారణ మధ్య రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్ఠకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రాణ అంటే ప్రాణ శక్తి, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. అప్పటి వరకు ఆ విగ్రహానికి ప్రాణం ఉండదు. కేవలం విగ్రహం మాదిరిగానే పరిగణిస్తారు. ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో అప్పటి నుంచి విగ్రహంలోకి దైవం వచ్చి చేరుతుంది.

సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ప్రాణ ప్రతిష్ఠ తప్పనిసరిగా జరుగుతుంది. ఏదైనా విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ఆ విగ్రహానికి జీవం పోసే విధానాన్నే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ‘ప్రాణ్’ అనే పదానికి ప్రాణశక్తి అని, ‘ప్రతిష్ఠ’ అంటే స్థాపన అని అర్థం. మొత్తంగా చూసుకుంటే ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహంలో ప్రాణశక్తిని స్థాపించడం లేదా దేవతను విగ్రహంలోకి ఆహ్వానించడం అని అర్థం.

ప్రాణ ప్రతిష్టకు ముందు ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా పరిగణించరు. ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోనికి ప్రాణశక్తిని ప్రవేశపెట్టి, దానిని ఆరాధనీయ దేవతా స్వరూపంగా మారుస్తారు. అప్పుడే ఆ విగ్రహం పూజకు అర్హమైనదవుతుంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తులను ఆచార వ్యవహారాలతో మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తారు. ప్రతిష్ఠాపన తర్వాత భగవంతుడే ఆ విగ్రహంలో కొలువయ్యాడని చెబుతారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ సమయం అనేది నిర్ణయిస్తారు. శుభ ముహూర్తాలు లేకుండా మొక్కుబడిగా ప్రాణ ప్రతిష్ఠ చేయడం తగదని పండితులు చెబుతుంటారు.
ప్రాణ ప్రతిష్ఠకి ముందు ఆ విగ్రహాన్ని పూజకి ఉపయోగించరు. ప్రాణ ప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రవేశపెడతారు. భక్తులు విగ్రహాన్ని కేవలం విగ్రహంగా కాకుండా దేవుళ్ళ సజీవ స్వరూపంగా భావిస్తారు. ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత మాత్రమే ఆ విగ్రహం పూజ చేసేందుకు అర్హత సాధిస్తుంది. ఇలా చేసిన తర్వాత దేవుడి విగ్రహంలోకి కొలువై ఉంటాడు.

See also  YS Sharmila: చక్రం తిప్పిన కేవీపీ..! జగన్‌ను వ్యతిరేకించే నేతలతో షర్మిల మంతనాలు..!