Walking: వాకింగ్ చేస్తూ వారంలో మూడు కిలోలు, మూడు నెలల్లో 30 కిలోలు బరువు తగ్గొచ్చు, ఎలాగంటే…


Walking: ప్రపంచంలో ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఊబకాయం, అధిక బరువు. ఈ రెండింటి వల్లే ఎన్నో ఎన్నో ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం పెరిగిపోతోంది.
మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్, గుండెపోటు ఇవన్నీ రావడానికి ఊబకాయం దోహదపడుతుంది. కాబట్టి అధిక బరువును కచ్చితంగా తగ్గించుకోవాలి.

బరువును తగ్గించుకోవడం కోసం జిమ్ లో చేరి ఎంతో ఖర్చు పెడతారు కొంతమంది. నిజానికి అంత కష్టపడకుండానే కేవలం వాకింగ్ ద్వారానే బరువు తగ్గవచ్చు. ప్రతిరోజూ వాకింగ్ ఒకే సమయానికి చేయడం అలవాటు చేసుకోవాలి. ఒక్కరోజు కూడా ఆగకుండా ప్రతిరోజు వాకింగ్ చేసేవారు వారంలోనే మూడు కిలోలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి మూడు కిలోలు చొప్పున మూడు నెలల్లోనే 30 కిలోలు తగ్గే అవకాశం ఉంది.

వాకింగ్‌తో బరువు ఎలా తగ్గవచ్చు?
ఎన్నో అధ్యయనాలు చెప్పిన ప్రకారం గంటపాటు స్పీడుగా వాకింగ్ చేస్తే ఏడు రోజుల్లో మూడు కిలోల బరువు తగ్గవచ్చు. ఇలా 12 వారాలపాటు అంటే మూడు నెలల పాటు ప్రతి రోజూ స్కిప్ చేయకుండా గంటపాటు వేగంగా నడిస్తే 30 కిలోలు సులువుగా తగ్గవచ్చు. 30 కిలోలు కాకపోయినా ఎంత తక్కువగా వేసుకున్నా కూడా 20 కిలోలు తగ్గే అవకాశం ఉంది. కాకపోతే వాకింగ్ చేసేటప్పుడు చాలా వేగంగా నడవాలి. చెమటలు పట్టాలి. కొంతమంది చాలా కూల్‌గా, మెల్లగా నడుచుకుంటూ వెళ్తారు. అలాంటి వాకింగ్ వల్ల బరువు తగ్గే అవకాశం తక్కువ. వేగంగా నడుస్తూ చేసే వాకింగ్ వల్ల ఉపయోగం ఉంటుంది.

ఆహారం కూడా…
కేవలం వాకింగ్ ఒక్కటే కాదు, ప్రతిరోజూ గంట వాకింగ్ చేస్తున్న సమయంలో ఆహార నియంత్రణను పాటించాలి. అధిక కొవ్వు ఉండే పదార్థాలు తీసుకోకూడదు. అలాగే పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నవి తినకూడదు. పండ్లు, తాజా కూరగాయలతో వండిన ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మాంసాహారాన్ని తగ్గించాలి. అధిక కొలెస్ట్రాల్ ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ ఆహారపు అలవాట్లను పాటిస్తూ వాకింగ్ చేస్తే మీకు నెల రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

వాకింగ్ చేసేటప్పుడు ఏదో అలా షికారుకు వెళ్లినట్టు కాకుండా వేగంగా నడవాలి. మొదటిరోజు కాస్త కష్టంగా అనిపించవచ్చు, ఒక వారం రోజులు చేస్తే అలవాటైపోతుంది. వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడమే కాదు, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మతిమరుపు వంటి సమస్యలు రావు. గుండెకు కూడా వాకింగ్ ఎంతో మేలు చేస్తుంది. రక్త సరఫరా శరీరంలో సవ్యంగా జరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అధిక రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజు వాకింగ్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల బీపీ పెరగకుండా అదుపులో ఉంటుంది. ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు వాకింగ్ చేస్తే మంచిది. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు వాకింగ్ చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు.

See also  Pomegranate Juice: ఎలాంటి అనారోగ్య సమస్యలైనా దానిమ్మ రసంతో చెక్ పెట్టండిలా!