అరుదైన రికార్డ్.. ఒక్క బంతి కూడా వేయకుండానే వికెట్ తీశాడు


అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేరిట ఓ అరుదైన ఘనత ఉంది. ఒక బంతి కూడా వేయకుండానే వికెట్ తీసిన ఏకైక బౌలర్‌గా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు.
2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో కోహ్లీ తొలిసారి బౌలింగ్ చేశాడు. వేసిన మొదటి బంతి వైడ్ వెళ్లింది. కానీ బ్యాటర్ పీటర్సన్ ముందుకెళ్లి ఆడే ప్రయత్నంలో భాగంగా క్రీజు దాటగా, వికెట్ కీపర్ ధోని స్టంపింగ్ చేశాడు. దీంతో కోహ్లీ ఒక బంతి కూడా వేయకుండానే వికెట్ తీశాడు.

See also  చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఒకే ఒక్కడిగా..!