Vastu Tips: వామ్మో.. అపరాజిత పుష్పాలతో అన్ని రకాల ప్రయోజనాల.. సంపద, శ్రేయస్సుతో పాటు..?


హిందూమతంలో పూల మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల పూల మొక్కలు, కొన్ని పూలు విశేషమైన గొప్ప లక్షణాలను కలిగి ఉంటాయి. అటువంటి పూలలో అపరాజిత పుష్పాలు కూడా ఒకటి.
వీటినే
శంఖు పుష్పాలు అని కూడా పిలుస్తారు. గొప్ప ఆయుర్వేద లక్షణా లు కూడా అపరాజిత పుష్పాలకు ఉన్నాయి. ఉద్యానవనాలు, గృహాల అందాన్ని పెంచేందుకు నాటిన అపరాజిత మొక్కను ఆయుర్వేదంలో విష్ణుక్రాంత, గోకర్ణి మొదలైన పేర్లతో పిలుస్తారు. నెమలి ఈకల మాదిరిగా, శంఖు మాదిరిగా అందమైన షేప్ లో, ఈ అపరాజిత పుష్పాలు ఉంటాయి.

అపరాజిత పుష్పాలు విష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాలు. ఈ పుష్పాలంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. మాములుగా ఈ పుష్పాలు రెండు రంగులలో ఉంటాయి. తెలుపు రంగు, నీలం రంగు. తెలుపు రంగు అపరాజిత పుష్పాలు విష్ణు పూజకు వినియోగిస్తే, నీలం రంగు అపరాజిత పుష్పాలు శివునికి సమర్పిస్తారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడంలో కూడా నీలం రంగు అపరాజిత పుష్పాలను నివేదిస్తారు. హిందూధర్మం లోనే కాకుండా జ్యోతిష్యంలో కూడా అపరాజిత పుష్పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అపరాజిత పుష్పం సంపద శ్రేయస్సును ఆకర్షిస్తుంది.

బాగా డబ్బులు సంపాదించాలన్నా, ఉద్యోగం వ్యాపారంలో పురోగతి సాధించాలన్నా అపరాజిత మొక్కలను ఇంట్లో పెట్టుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అపరాజిత మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటే ఎక్కడపడితే అక్కడ దానిని పెంచకూడదు. కచ్చితంగా వాస్తు నియమాలను పాటించాలి. మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అనుకునేవారు ఉత్తరం దిశలో పెడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో నీలిరంగు అపరాజిత మొక్కలు నాటితే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. అపరాజిత పూలతో శని దేవుడికి పూజ చేస్తే శని దోషాలు తొలగిపోతాయి.ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే అపరాజిత మొక్కలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ మొక్కలను ఇంట్లో పెంచుకొని మీరు సంపదను రెట్టింపు చేసుకోవడంతో పాటు, ముసలి నుంచి గట్టెక్కండి.

See also  Vastu Tips: ఇంట్లో గడియారం తప్పు దిశలో ఉంచుతున్నారా.. అయితే ఈ తిప్పలు తప్పవు?
, ,