Vastu Tips For Money: ఈ చిన్న పనులు చేస్తే చాలు.. లక్ష్మీదేవి ఎప్పుడు మీ వెంటే?


ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే చాలామంది ఈ వాస్తు శాస్త్రం విషయంలో సరైన అవగాహన లేక దోషాలకు గురవుతున్నారు.

మరికొందరి మాత్రం వాస్తు విషయాలను పాటిస్తూ ఆర్థిక సమస్యల నుంచి బయటపడి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారు. అయితే కొన్ని రకాల వాస్తు దోషాల వల్ల ఇష్టం లేకపోయినప్పటికీ జీవితంలో ఎన్నో రకాల ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వాస్తు చిట్కాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహం ఏ విధంగా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు విషయంలో ప్రతి ఒక్కటి కూడా సరైన దిశలో ఉంచాలి.

ముఖ్యంగా బాత్రూం కూడా ఒకటి. బాత్రూం సరైన దిశలో ఉండడంతో పాటు మామూలుగా మనం స్నానం చేసిన తర్వాత బాత్రూంలో ఖాళీ బకెట్ ను ఉంచుతూ ఉంటాము. కానీ బాత్రూంలో ఎప్పుడూ ఖాళీ బకెట్ ను ఉంచకూడదు. అలా చేయడం అశుభం. బాత్రూంలో బకెట్ ను ఖాళీగా ఉంచడం వల్ల అది ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంది. కాళీ బకెట్ తో ఉంచడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు.. కాబట్టి ఎప్పుడు రాత్రి సమయంలో బకెట్ ను కాళీ ఉంచకుండా నీటితో నింపి

ఉంచడం వల్ల లక్ష్మీ సంతోషిస్తుంది. అదేవిధంగా వైవాహిక జీవితం సరిగా లేకపోతే వాస్తు దోషాలు కూడా కారణం కావచ్చు. అయితే ఇదివరకు భార్యలు ఇంటి పని చూసుకుంటే భర్తలు బయట పనిచేసే సంపాదించే వాళ్లు.

కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారపోయి భార్య భర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేయడంలో బిజీ బిజీ అయిపోయారు. అయితే అలసిపోయి వచ్చిన భార్య భర్తలు ఎలా ఉండాలి? ఎలా పడుకోవాలి అన్న విషయం పై వాస్తు శాస్త్రంలో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. దక్షిణ దిశలో పడుకోవడం మంచిది. ఒకవేళ ఇల్లు ఇరుకుగా ఉంది బెడ్ రూమ్ లేని వారు పాదాలను దక్షిణం వైపు ఉండేవిధంగా మంచాన్ని అమర్చుకొని నిద్రపోవాలి. ఉత్తరం వైపు ఎప్పుడు ప్లస్, దక్షిణం వైపు మైనస్ గా భావించాలి. అలా మన శరీరంలో కాలు మైనస్ గా తల ప్లస్ గా ఉంటుంది కాబట్టి మైనస్ మైనస్ అలాగే ప్లస్ ప్లస్ ఒక దిశ వైపు ఉండకూడదు. అలాగే దక్షిణం వైపునకు పాదాలను ఉత్తర వైపును తల పెట్టడం మంచిది. ఈ వాస్తు నియమాలు పాటిస్తే దంపతుల మధ్య ఎలాంటి గొడవలు రాకపోగా ధనలక్ష్మి ఇంట్లో కొలువై ఉంటుంది. అంతే కాకుండా కుటుంబంలో అందరూ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు.

See also  Bommalamma Jona: భీముడు కూర్చున్న కుర్చీ ఇక్కడే ఉంది.. పాండవులు నివాసమున్నదీ అక్కడే..!
,