Vastu tips for dust bin: ఈ దిశలో డస్ట్ బిన్ పెడుతున్నారా? డబ్బు నష్టపోతారు జాగ్రత్త


Vastu tips for dust bin: మన అందరి ఇళ్ళల్లో తప్పనిసరిగా చెత్త వేసుకునేందుకు డస్ట్ బిన్ ఉంటుంది. కానీ దాన్ని చాలా మంది కిచెన్ లో పెట్టుకుంటారు.
వంట చేసేటప్పుడు, ఎంగిలి అంట్లు శుభ్రం చేసుకునేటప్పుడు చెత్త తీసి వేసేందుకు అనువుగా ఉంటుందని పెట్టుకుంటారు.

మరికొందరు ఇంట్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. మరికొంతమంది ఇంటి గుమ్మం పక్కన ఖాళీ స్థలం ఉంటే అక్కడ పెట్టేస్తారు. చెత్త వేసుకునేందుకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ పెట్టేస్తారు. దీనికి వాస్తుతో సంబంధం ఏముందని అనుకుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం డస్ట్ బిన్ పెట్టుకోకపోతే అది ఇంటి సభ్యుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్ బిన్ పెట్టేందుకు ప్రదేశం, దిశ కూడా ఉన్నాయి. చెత్త బుట్టని సరైన దిశలో పెట్టకపోతే ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది. దీని వల్ల వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల్లో విభేదాలు తలెత్తుతాయి. ఇంట్లో తరచుగా గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది. అందుకే డస్ట్ బిన్ ఉంచే ఉంచేటప్పుడు వాస్తుతో పాటు దిశ కూడా చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం డస్ట్ బిన్ ఏ దిశలో ఉంచకూడదో తెలుసుకుందాం.

ఈ దిశలో డస్ట్ బిన్ పెట్టకూడదు

ఈశాన్య దిశ: వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశలో చెత్తబుట్టలు పెట్టకూడదు. అలా చేస్తే ధన నష్టం పెరిగి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్ముతారు. ఇంట్లో వాళ్ళు ఎంత సంపాదిస్తున్నా కూడా చేతిలో మాత్రం డబ్బు నిలవకుండా పోతుంది.

ఆగ్నేయ దిశ: ఇంటి ఆగ్నేయ దిశలో డస్ట్ బిన్ పెడుతుంటే వెంటనే దాన్ని తొలగించేయండి. ఈ దిశలో చెత్త డబ్బా పెట్టడం వల్ల ఎంత కష్టపడినా కూడా ఆ వ్యక్తి అన్ని ప్రయత్నాలు వృధా అవుతాయి. ఏదైనా పని తలపెడితే అనేక అడ్డంకులు ఎదురవుతాయి.

ఉత్తర దిశ: ఇంటి ఉత్తర దిశలో డస్ట్ బిన్ ఉంచడం శుభప్రదంగా పరిగణించబడదు. దీని వల్ల ఉద్యోగం, వ్యాపారంలో సమస్యలు వస్తాయని నమ్ముతారు.

పడమర దిక్కు: ఎంత కష్టపడినా విజయం మాత్రం సాధించలేకపోతున్నారా? అయితే అందుకు కారణం మీ ఇంటి పడమర దిశలో ఉంచిన డస్ట్ బిన్ కూడా కావచ్చు. వాస్తు ప్రకారం దుమ్ము ధూళిని ఇంటి పడమర దిశలో ఉంచకూడదు. దీని వల్ల చేసే పనులన్నింటిలోను ఆటంకాలు ఏర్పడతాయి.

See also  Phone Charging: ఫోన్‌కు ఎప్పుడు పడితే అప్పుడు ఛార్జింగ్ పెడుతున్నారా? రోజు ఎన్నిసార్లు ఛార్జ్ చేయాలి.. !

దక్షిణ దిక్కు: వాస్తు ప్రకారం ఇంటి దక్షిణ దిశలో డస్ట్ బిన్ పొరపాటున కూడా పెట్టకూడదు. ఇలా చేస్తే డబ్బు ఇంట్లో నిలవదు. తరచూ నెగటివ్ ఆలోచనలు కూడా వస్తాయట.

ఏ దిశలో డస్ట్ బిన్ పెట్టాలి?
వాస్తు ప్రకారం ఇంటి డస్ట్ బిన్ పెట్టేందుకు ఎప్పుడు నైరుతి లేదా వాయువ్య దిశ ఎంచుకోవాలి. ఈ దిశలో చెత్త డబ్బా పెట్టడం వల్ల పని మీద దృష్టి పెడతారు. ప్రతికూల ఆలోచనలు మనసులోకి రాకుండా ఉంటాయి. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.