ఆ గ్రామంలో మొత్తం 75 ఇళ్లు.. 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు..


సాధారణంగా ఏదైనా గ్రామంలో ఐఏఎస్ లేదా ఐపీఎస్( IAS or IPS ) ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారనే ప్రశ్నకు మెజారిటీ గ్రామాలలో ఒక్కరు కూడా ఉండరనే సమాధానం వినిపిస్తుంది.
ఐఏఎస్, ఐపీఎస్ కావడం సులువైన విషయం కాదు. అయితే ఒక గ్రామంలో మాత్రం 75 ఇళ్లు ఉండగా ఆ గ్రామంలో ఏకంగా 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉండటం గమనార్హం. ఆ ఊరిని నెటిజన్లు ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తున్నారు.

యూపీలోని జౌన్ పూర్ జిల్లాలోని మాధోపట్టి ( Madhopatti )ఈ గ్రామం పేరు కాగా లక్నోకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం పేరు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతోంది. పండుగలు వస్తే చాలు ఈ గ్రామం ఖరీదైన లగ్జరీ కార్లతో కళకళలాడుతుంది. ఒక గ్రామంలో 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉండటం అంటే అరుదైన రికార్డ్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రతి సంవత్సరం ఈ గ్రామం నుంచి సింగిల్ డిజిట్ లో విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతూ దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నారు. పెద్దపెద్ద నగరాలకు సైతం సాధ్యం కాని ఘనత ఈ గ్రామానికి సొంతమైందంటే ఈ గ్రామంలో ఏదో ప్రత్యేకత ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎలాంటి కోచింగ్ సెంటర్లు లేని ఈ గ్రామం ఎన్నో గ్రామాలకు స్పూర్తిగా నిలుస్తుందని కొంతమంది చెబుతున్నారు.

దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో ఈ గ్రామంలోని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు సేవలు అందిస్తున్నారు. పిల్లలను ఐఏఎస్, ఐపీఎస్ లను చేస్తున్న ఈ గ్రామస్తులను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. మాధోపట్టి గ్రామానికి సంబంధించిన విషయాలు, విశేషాల గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ గ్రామం మరింత మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫర్లను అందించి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును మార్చాలని ఆశిద్దాం. ఈ గ్రామం ఆదర్శ గ్రామం అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

See also  Success Story of  ZPHS, Kesapuram HM & School Staff ( Kotha Cheruvu Mandal / Anantapuram District )