-
500 ఎకరాల భూమి దానం.. రిక్షాలో అసెంబ్లీకి..
‘బండెనకబండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో నైజాము సర్కరొడా’ అంటూ రైతాంగ కార్యకర్త బండి యాదగిరి రాసిన ఈ పాట దోపిడీ, పోరాటం ఉన్నన్నాళ్లు చిరస్మరణీయమే. అయితే ఈ పాటకు ప్రేరణగా నిలించింది భీమ్‌రెడ్డి నర్సింహారెడ్డి, రావినారాయణరెడ్డి అని ఎంత మందికి తెలుసు. యాదగిరి లాంటి చదువురాని కార్యకర్తలకు చదువు పోరాటాన్ని నూరిపోశారు రావినారాయణరెడ్డి. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పెత్తందారీ వ్యవస్థను పెకిలించేందుకు పిడికిలి బిగించిన ధీశాలి. నమ్మిన సిద్ధాంతాన్ని తుదిశ్వాస…