SSC Recruitment 2024: పది పాసైతే చాలు కేంద్రప్రభుత్వ ఉద్యోగం.. 5639 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..


SSC Recruitment 2024: మీరు కేంద్రప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు ఇది బంగారు అవకాశం. SSC 5 వేలకు పైగా ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
దీనికి కేవలం పదిపాసైతే చాలు. పోస్టుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
అర్హత..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 5639 పోస్టులకు మేలో పరీక్షలు నిర్వహించనుంది.
దీనికి అర్హత ప్రమాణాలు ఇలా ఉన్నాయి.. పది, ఇంటర్, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలు 2024 మే 6 నుంచి 8 వరకు జరగనున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసకోవాలనుకునే అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in లో అప్లై చేసుకోవచ్చు.

వయస్సు..
ఈ పోస్టులకు అప్లై చేసుకునేవారి వయస్సు 18 ఏల్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము..
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన, మహిళ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు వసూలు చేయరు.

ఎంపిక ప్రక్రియ..
మొదటగా రాత పరీక్ష నిర్వహిస్తారు. పాసైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. ఆ తర్వాత స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ పరీక్షలు నిర్వహిస్తారు.

దరఖాస్తు చేసుకునే విధానం..
ssc.nic..in అధికారిక వెబ్‌సైట్లో నేరుగా అప్లై చేసుకోవాలి.
హోం పేజీలో లాగిన్ ఆప్షన్ ఉంటుంది. మీకు సంబంధించిన వివరాలను అందులో నమోదు చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుము చెల్లించి చివరగా ప్రింట్ అవుట్ తీసిపెట్టుకోవాలి.

జీతభత్యాలు..
టెక్నికల్ అసిస్టెంట్: రూ.5200-20200, రూ.2800 గ్రేడ్ పే అందిస్తారు.
సీనియర్ ట్రాన్స్లేటర్: రూ. 9300-34800, గ్రేడ్ పే రూ. 4600
లాంగ్వేజ్ ఇన్‌స్ట్రక్టర్: రూ.9300-34800, గ్రేడ్ పే రూ.4800
టెక్నికల్ అసిస్టెంట్ (ఎకనామిక్స్): రూ. 9300-34800, గ్రేడ్ పే రూ.42800
ఫిల్టర్ పంప్ డ్రైవర్: రూ.5200-20200, గ్రేడ్ పే 1900
సీనియర్ ఆటో విజువల్ అసిస్టెంట్: Rs 9300-34800 గ్రేడ్ పే రూ.4200
జూనియర్ కెమికల్ ఇంజినీర్: Rs 9300-34800, గ్రేడ్ పే రూ. 4200
డేటా ఎంట్రీ ఆపరేటర్ Grade A: గ్రేడ్ పే రూ. 5200-20200 రూ. 2400
జూనియర్ డ్రాఫ్ట్‌మెన్: Rs 5200-20200 గ్రేడ్ పే రూ. 2800
క్యాంటిన్ అటెండెంట్: 5200-20200 గ్రేడ్ పే రూ. 1800

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Mannam Web దీనిని ధృవీకరించడం లేదు. )

See also  Railway Jobs 2024 : రైల్వేలో 1646 యాక్ట్ అప్రెంటిస్ లు..అర్హతలేంటంటే?