సోదరుడు జగన్ YCP పార్టీకి కొత్త అర్థం చెప్పిన షర్మిల


ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తనదైన శైలీలో అధికార వైపీపీ పార్టీపై, సోదరుడు సీఎం జగన్‌పై విమర్శలు కురిపించారు. సోదరుడు జగన్ వైసీపీ పార్టీకి షర్మిల కొత్త అర్థం చెప్పారు.
శనివారం షర్మిల కాంగ్రెస్ నాయకులతో కలిసి గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ప్రాజెక్ట్ నిర్వహణ తీరును చూసి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ప్రారంభించిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రాజెక్ట్ నిర్వహణకు ఏడాదికి కోటి రూపాయలు కూడా కేటాయించడం లేదని నిప్పులు చెరిగారు. వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను పట్టించుకోని మీరా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నిలబెట్టేవాళ్లని ప్రశ్నించారు.

వైఎస్సార్సీపీలో వైఎస్ఆర్ లేడని.. వైఎస్ఆర్ అంటే వైవీ సుబ్బారెడ్డి (Y), సాయిరెడ్డి (S), రామకృష్ణారెడ్డి (R) అని షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త అర్థం చెప్పారు. వైఎస్సార్సీపీ పార్టీలో వైఎస్ లేడని.. ఇది జగన్ రెడ్డి పార్టీ, నియంత పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఆశయాలను గాలికి వదిలేసి.. బీజేపీకి బానిసైన పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ ప్రారంభించిన ఎన్నో ప్రాజెక్ట్‌లను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుత జగన్ సర్కార్ పట్టించుకోలేదని షర్మిల ఫైర్ అయ్యారు.

See also  Drinking Water: పళ్ళు తోముకుండా ఉదయాన్నే నీటిని తాగితే ఏం జరుగుతుంది తెలుసా?