Viral ఎప్పుడో కనుమరుగైన అర్ధనారీశ్వర పక్షి మళ్లీ ఇప్పుడు కనపడటం వెనుక శాస్త్రీయ కోణం ఉందా…. ఈ పక్షి పుట్టుక వెనుక శివ మహిమ ఉందా.. పరిశోధకులు ఏమంటున్నారు. ఇప్పుడు ఈ పక్షి ఎక్కడ కనపడిందో తెలుసుకుందాం..


2023 ఎండింగ్ సమయంలో శివుడి అర్ధనారీశ్వర రూపం భూమి మీదకు పక్షి రూపంలో అవతరించిందా… ఎప్పుడో కనుమరుగైన అర్ధనారీశ్వర పక్షి మళ్లీ ఇప్పుడు కనపడటం వెనుక శాస్త్రీయ కోణం ఉందా…. ఈ పక్షి పుట్టుక వెనుక శివ మహిమ ఉందా.. పరిశోధకులు ఏమంటున్నారు. ఇప్పుడు ఈ పక్షి ఎక్కడ కనపడిందో తెలుసుకుందాం..

హిందూ సంప్రదాయంలో శివుడిని అర్ధనారీశ్వరుడిగా పూజిస్తారు. పురాణాల ప్రకారం పార్వతీదేవిని తనలో సగభాగంగా చేసుకున్న శివయ్య అర్ధనారీశ్వరుడిగా పూజలు అందుకుంటాడు. వందేళ్ల క్రితం కొలంబియాలో కనపడిన హనీక్రీపర్ అనే పక్షిలో సగంభాగం ఒకలా.. మరో సగభాగం ఇంకోలా ఉందని గుర్తించారు.

కొలంబియాలో ఉత్పరివర్తన చెందిన హనీక్రీపర్ ‘ అనే పక్షులివి. వీటిలో..మధ్యలో ఉన్న కార్డినల్ ఇప్పుడు ఏకాకి అయిపోయింది. సగం ఆడ, సగం మగ శరీరంతో పుట్టడమే దీని పాలిట శాపంగా మారింది. ఈ జాతి పక్షుల్లో మగవి ఎరుపు, ఆడవి బూడిద రంగులో ఉంటాయి. ఈ పక్షి మాత్రం సగం ఎరుపు, సగం బూడిద రంగులో పుట్టింది. అలాంటి జీవులను గైనండ్రోమోర్ఫ్ అంటారు. ఆడ, మగ రెండు లక్షణాలు ట్రాన్స్ జండర్ లక్షణాలు గల పక్షులు చాలా అరుదుగా కనపడతాయి. వందేళ్ల క్రితం ఒక పక్షి ఉండేదని.. అయితే అది అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు భావించారు. కానీ అది మళ్లీ మళ్లీ కనిపించింది.

ఇటీవల కొలంబియాలో ట్రాన్స్ జండర్ పక్షి హనీక్రీపర్ న్యూజిలాండ్ ఒటాగో యూనివర్శిటీకి చెందిన పరిశోధకులకు కనిపించిందని దాని చిత్రాన్ని వారు సోషల్ మీడిమాలో పోస్ట్ చేశారు. వందేళ్ల తరువాత ఇప్పుడు 2023 లో కనపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. హనీక్రీపర్ పక్షి పుట్టకముందు గుడ్డుగా పొదిగే దశలో దీని కణాల్లో లైంగిక క్రోమోజోములు అసమానంగా విభజనకు గురయ్యాయట. దీంతో గైనాండ్రోమార్ఫిజమ్(ఉభయ లైంగికత్వం)తో ఇది పుట్టింది. దీనికి ఆడ, మగ రెండు రకాల లైంగిక అవయవాలూ ఉన్నాయట. తోటి కార్డినల్స్ దీనిని దాడులు, వెలేయటం వంటివి చేయకపోయినా ఇది ఏ పక్షితోనూ జతకట్టకుండా ఒంటరిగానే జీవిస్తోందట. ఇతర కార్డినల్స్ మాదిరిగా ఈల పాటలు కూడా ఇది పాడటం లేదని పరిశోధకులు వెల్లడించారు. కార్డినల్స్లో ఇలాంటి అర్ధనారీశ్వర పక్షిని వందేళ్ల క్రితం గుర్తించగా, మళ్లీ ఆ తర్వాత కనిపించిన పక్షి ఇదేనని చెబుతున్నారు.

See also  Ram Jyoti: ఇంటింటా ‘రామ జ్యోతి’.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి?
,