Relationship : భార్యతో రొమాంటిక్ రిలేషన్ బాగుండాలంటే ఈ 5 సూత్రాలు పాటించాలి.


Relationship : భార్యభర్తల బంధం శాశ్వతమనది. ఒక్కసారి ఏడడుగులు నడిచిన తరువాత జీవితాంతం కట్టుకున్న వ్యక్తితోనే గడపాల్సి ఉంటుంది. అయితే నేటి కాలంలో భార్యభర్తల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ వల్ల పెళ్లయిన కొద్ది కాలానికే దూరమవుతున్నారు.
ఒకప్పుడు పెళ్లిళ్లు చేసుకున్న వారు సాంప్రదాయ కట్టుబాట్లతో రిలేషన్ షిప్ ను శాశ్వతంగా మెయింటేన్ చేసేవారు. కాలం మారుతున్న కొద్దీ భార్యభర్తల మధ్య ఉన్న అనుబంధం తగ్గిపోతుంది. దీంతో ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నారు. పెళ్లయిన దంపతుల్లో భార్యభర్తలు ఇద్దరూ సమానమే. అయితే రొమాంటిక్ లైఫ్ విషయానికొచ్చేసరికి భర్తపై భార్య మనసు పడాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. వీటి ద్వారా తమ భాగస్వామిని ఆకట్టుకోగలగాలి. ఇంతకీ ఆ సూత్రాలేంటంటే?

గౌరవం:
ఒక వ్యక్తిని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను.. అని చాలా మంది అంటుంటారు. అందుకు ఆ వ్యక్తి రూపం, అందం అని కొందరు అంటుంటారు. కానీ ఆ వ్యక్తి ప్రవర్తనే అసలైన కారణం. ఇతరులతో ఆ వ్యక్తి ఎలా నడుచుకుంటున్నాడు? మర్యాదగా ప్రవర్తిస్తున్నాడా? దయా గుణం ఉంటుందా? అనే విషయాలు ప్రతి భార్య తన భర్తలో చూస్తుంది. ఈ లక్షణం ఉన్న భర్తను ఎక్కువగా ఇష్టపడుతుంది. అందంగా, ఆకర్షణీయంగా లేకపోయినా ఇలాంటి లక్షణం ఉంటే ఎక్కువ ప్రేమ చూపుతుంది.

సున్నితం.. ఆధిపత్యం:
భార్యభర్తల మధ్య ప్రేమానుబంధాలు ఉన్నప్పుడే వారి జీవితం బాగుంటుంది. ముఖ్యంగా భార్యపై సున్నిత మనస్తత్వం ఉండాలి. వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఏదైనా సమస్య వస్తే చికాకు పడకుండా వాటి పరిష్కారానికి కృషి చేయాలి. అందమైన మాటలు మాట్లాడాలి. కొందరు మహిళలు చాలా సున్నితంగా ఉంటారు. అయితే భర్తలు రాష్ గా బిహేవియర్ చేయడంతో వారు లోలోలపల మదనపడుతూ ఉంటారు. ఇదే సమయంలో ఒక్కోసార ఆధిపత్యం చెలాయించే గుణం కూడా ఉండాలి. ఎందుకంటే భార్య చేసే కొన్ని తప్పులు చూపిస్తూ వారిని సక్రమమైన మార్గంలో నడిపించగలిగాలి. అప్పుడు తన భర్తపై నమ్మకం పెరుగుతుంది.
ఎదుటివారిని అర్థం చేసుకునే మనస్తత్వం:
భాగస్వామి విషయంలో కొందరు పురుషులు నిర్లక్ష్యంగా ఉంటారు. ముఖ్యంగా కొందరు భర్తలు తమ భార్య ఏం చెప్పినా పెద్దగా పట్టించుకోరు. పైగా వారిని హేళన చేస్తారు. ఇలాంటి వారిని దూరంగా పెట్టేందుకు ప్రయత్నిస్తారు. అయితే వారు ఏం చెబుతున్నారో కాస్త ఓపిగ్గా విని ఆ తరువాత వారి పనులు చేయగలిగితే భర్తపై అధికమైన ప్రేమ చూపుతారు. దీంతో భార్యభర్తల మధ్య రొమాంటిక్ రిలేషన్ బలంగా మారుతుంది.

See also  Saunf Seeds Benefits: సోంపు గింజలతో సులువుగా బరువు తగ్గండి ఇలా !

ఇంట్లో తోడుగా..
చాలా మంది మహిళలు భర్తలు విధుల్లోకి వెళ్లి వచ్చిన తరువాత వారిని డిస్ట్రబ్ చేయరు. కానీ వారి నుంచి అమితమైన ప్రేమను పొందేందుకు వారి పనులు చేయగలిగాలి. ఉదాహరణకు వంట గదిలో లేదా ఇంట్లో కొన్ని పనులు వారికి సాయంగా ఉంటూ చేయగలిగాలి. ఇలా చేయడం వల్ల మీ వెంటే జీవితాంతం అనే భావన కలుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగంలో ఏదైనా సమస్యలు వచ్చిన సమయంలో వారు మీకు తోడుండడానికి ప్రయత్నిస్తారు.

అన్ని విషయాల్లో కలుపుగోలుగా..
భర్తలు కొన్ని బయట జరిగే విషయాలు భార్యలతో చెప్పలేరు. కానీ తమ పర్సనల్ విషయాలను చెప్పుకోగలగాలి. లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ విషయాన్ని చెప్పబోతే వారు పట్టించుకోరు. అన్ని విషయాల్లో కలుపుగోలుగా ఉండగలిగితే వారు మీపై ఎక్కువ ప్రేమ చూపుతారు. దీంతో ప్రేమానుబంధాలు పెరుగుతాయి.