జపాన్ పౌరుల జీవిత కాలం ఇతరులకంటే ఎక్కువ ఉండడానికి కారణాలు…


జపాన్ పౌరుల జీవిత కాలం ఇతరులకంటే ఎక్కువ ఉండడానికి కారణాలు…
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం, జపాన్ మహిళల సరాసరి జీవిర కాలం 87 సంవత్సరాలు, ఇది ప్రపంచంలోనే అత్యధికం. పురుషుల జీవితకాలం అంతర్జాతీయంగా టాప్ 10 లో ఉంది. దానికి గల వివిధ కారణాలు:

1) కూరగాయలు ఎక్కువగా తింటారు. జాపనీస్ వారి సాంప్రదాయక ఆహారంలో బియ్యం, కూరగాయలు మరియు చేపలు ఎక్కువ. కొన్ని రకాల ఆహారాలను పులియబెట్టి తినడం వలన ఎక్కువ విటమిన్లు, మినరల్స్ మరియు ప్రయోజనకరమైన ఫైటోకెమికల్స్ శరీరానికి అందుతాయి.

2) జపాన్ ఒక ద్వీపం కాబట్టి, చేపలు మరియు ఇతర సీఫుడ్ జపనీయుల భోజనంలో అత్యంత ముఖ్యమైన భాగం. చేపల్లో ఇతర మాంసం కన్నా తక్కువ కొలెస్ట్రాల్ మరియు కొవ్వు ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ.

3) ఆహారం వండే విధానం కూడా వేరుగా ఉంటింది. వాటిలో స్టీమింగ్, పాన్ గ్రిల్లింగ్, బ్రాయిలింగ్, స్టిర్-ఫ్రైయింగ్, మరియు పులియబెట్టడం ఎక్కువ.

4) టీ, గ్రీన్ టీ ఎక్కువగా తాగుతారు. మంచి క్వాలిటీ జపనీస్ టీలో యాంటీఆక్సిడెంట్స్ కాఫీ కంటే ఎక్కువ.

5) ఆహారం తాజాగా ఉంటుంది మరియు సీజనల్. జపాన్ చిన్న ద్వీపసమూహం మరియు జనాభాకు సరిపడా సాగునీరు, భూమి ఉన్నందున, ఆహారం నోళ్లలోకి ప్రవేశించే ముందు చాలా దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. అవి కూరగాయలైనా, చేపలైనా.

6) చిన్న ప్లేట్లలో తినే అలవాటు. ఒకేసారి అధిక మోతాదులో ఆహారం తీసుకోకుండా వీలయినన్ని ఎక్కువ సార్లు చాలా తక్కువ మోతాదులో తింటారు.

7) జపాన్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదా సైకిల్ ప్రయాణం ఎక్కువ. సొంత వాహనం ఉపయోగించడం కన్నా దీనివలన రోజూ కొంత శరీరానికి వ్యాయామం దొరుకుతుంది.

8) 1960 ల నుంచే జపాన్ లో ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా లైఫ్ ఇన్స్యూరెన్సె సౌకర్యం కల్పించారు. అలాగే మెజారిటీ జపనీయులు రెగులర్ గా హెల్త్ చెకప్‌లు చేయించుకుంటారు. సగటున ఒక వ్యక్తి డాక్టర్ను సంవత్సరానికి ఒక డజనుకు పైగా చెక్-అప్స్ కొరకు సంప్రదిస్తాడు.

9.చురుకుగా ఉండి, సరైన ఆహార పదార్ధాలను సరైన విధానంలో తినడం ద్వారా, ఎవరైనా వారి ఆరోగ్యంంగా, ఆనందంగా ఉండడంతో పాటు దీర్ఘాయువు పొందవచ్చు.

See also  రాత్రిళ్లు లైట్స్ వేసుకుని నిద్రపోతున్నారా ? అయితే జాగ్రత్తగా ఈ వ్యాధుల ప్రభావం ఎక్కువట.. అధ్యాయనంలో షాకింగ్ విషయాలు..
,