చింత చెట్టును శపించిన రాధా రాణి ? కారణం ఏంటో తెలుసా


శ్రీ కృష్ణ పరంధాముడు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బృందావనం, ద్వారకా. అయితే ప్రతి ఏడాది శ్రీ కృష్ణుని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి బృందావనానికి విచ్చేస్తూ ఉంటారు.
శ్రీ కృష్ణుని ఒక్కో ఆలయంలో ఒకో లీల, ఒక్కో రహస్యం దాగి ఉంటుంది. ఈ లీలలు విన్నా, తలచుకున్నా భక్తుల జన్మ తరిస్తుంది. అలాంటి ఎన్నో అద్భుతమైన దేవాలయాలు, ప్రదేశాలు బృందావనంలో అనేకం ఉన్నాయి. ఇక్కడ కిట్టయ్య బాల్యంలో గడిపిన ఎన్నో గురుతులు నేటికీ కనిపిస్తాయి. అలాంటి అద్భుతమైన ఆలయాల్లో ఇమ్లితాలా ఒకటి. ఈ ప్రాంతంలోని మొక్కలు, మనుషులు రాధాదేవి శాపానికి గురయ్యారని చెబుతుంటారు. వాటిలో చింత చెట్టు కూడా ఒకటి. అసలు రాధారాణి ఎందుకు ఈ వృక్షాలను శపించిందో దాని వృత్తాంతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాధా రాణి అలంకరణను చెడగొట్టిన చింత చెట్టు

ఇమ్లి తాలా ఆలయం బృందావనం లోని జుగల్ ఘాట్ సమీపంలో నెలకొని ఉంది. ఈ ప్రదేశం 5500 ఏండ్ల పురాతనమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం లోపల చింత చెట్టు ఉంది. ద్వాపర యుగంలో ఈ చెట్టుకు విపరీతంగా చింతపండ్లు కాసేవని చెబుతారు. ఒకసారి రాధాదేవి యమునా నాదిలో స్నానం చేసి ముచ్చటగా అలంకరించుకుని ఈ చెట్టు కిందకు వెళుతోంది. అదే సమయంలో ఈ చెట్టు నుండి చింతపండు పడడంతో దానిపై అడుగువేసిన రాధారాణి ఒక్కసారిగా జారి పడిపోయింది. దాంతో కారణంగా ఆమె అలంకరణ చెడిపోయింది. దీంతో కోపం తెచ్చుకున్న రాధారాణి ఈ చింత చెట్టును శపించింది. ఈ శాపం కారణంగా ఈ చెట్టుకు ఇప్పటి వరకు చింతపండు కాయలేదు.

See also  Beautiful village – తుర్‌తుక్…. సరిహద్దులో చిట్ట చివరి గ్రామం… కశ్మీర్ లోయలోని భూతల స్వర్గం! – 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన గ్రామం కథ….
, ,