Potatoes: బంగాళదుంపలను వీటితో కలిపి వండితే.. యమా డేంజర్.. జర జాగ్రత్త!


మన తెలుగు రాష్ట్రాల్లో బంగాళాదుంపల (Potatoes)తో ఎన్నో రకాల వంటకాలు తయారు చేస్తుంటారు. దహీ ఆలూ కర్రీ, ఆలూ డీప్ ఫ్రై, ఆలూ మసాలా, ఆలూ టమోటో కర్రీ, ఆలూ పరాటా, కట్లెట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆలూతో ఎన్నో రుచికరమైన వంటకాలు చేయొచ్చు.
వీటితో నోరూరించే స్నాక్స్ సైతం ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఆలుగడ్డలను సరిగా వండకపోతే అవి సరిగా జీర్ణం కావు. ఆలూ తినడం వల్ల బరువు తగ్గడం (Weight Loss) కూడా కష్టమైపోతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే సరైన మార్గంలో సరిగ్గా వండుకొని ఆలూ వంటకాలు తింటే.. బరువు అసలు పెరగదు. ఒక సింపుల్ ట్రిక్‌తో బరువు తగ్గాలనుకునే వారు కూడా వీటిని తీసుకోవచ్చు. మరి బంగాళాదుంపలను సరైన మార్గంలో ఉడికించడానికి సులభమైన టెక్నిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళాదుంపలను బాగా ఉడకబెట్టి, చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఫ్రీజర్‌లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల బంగాళాదుంపలలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) బాగా తగ్గుతుంది. ఫ్రీజర్‌లో ఉంచిన తరువాత ఈ ఉడకబెట్టిన బంగాళాదుంపలు మరింత ఆరోగ్యకరమైన, పోషకమైనవిగా మారతాయి. వీటిని వేడి నీటిలో 28 గ్రాముల పలచగా ఉన్న వైట్ వెనిగర్‌తో (Blanching) కాసేపు ఉడకనివ్వాలి. ఇలా చేస్తే బంగాళాదుంపలలో 30-40% గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు తగ్గుతాయి. వెనిగర్‌కు బదులుగా నిమ్మరసం కూడా హాట్ వాటర్‌లో కలుపుకోవచ్చు. అయితే జీఐ స్థాయిలను మిగతా వాటి కంటే మరింత సమర్థవంతంగా వెనిగర్ మాత్రమే తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే వెనిగర్‌ను ఆహారంలో చేర్చుకోవాలని డాక్టర్లు కూడా డయాబెటిక్ రోగులకు సూచిస్తుంటారు.
బంగాళాదుంపలలో స్టార్చ్ ఏర్పడే ప్రక్రియను తగ్గించడానికి ఇతర పద్ధతులు
బంగాళాదుంపలను కట్ చేసి, వాటిని వేడి నీటిలో 30 నిముషాల పాటు ఉడకనివ్వాలి. కొద్దిగా చల్లబడిన తర్వాత మళ్లీ ఉడికించాలి. దీనివల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గి, మరింత సులభంగా జీర్ణమవుతుంది. బంగాళదుంపలను ఉడకబెట్టేటప్పుడు లేదా మైక్రోవేవ్‌లో వండేటప్పుడు ఇతర పదార్థాలను కలపకుండా వండాలి. ఈ పద్ధతిలో బంగాళదుంపల్లో ఉప్పు, చక్కెర, కొవ్వు శాతం తగ్గుతుంది. రెండు వండిన బ్రకోలీలు, మెత్తగా చేసిన ఒక బంగాళాదుంప తీసుకోవడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. చాలామంది ఆలుగడ్డలపై పొట్టును వొలుస్తుంటారు. అలా కాకుండా పొట్టుతోనే వంట చేయడం ద్వారా పుష్కలమైన ఫైబర్ కంటెంట్ లభిస్తుంది.
కలిపి వండింతే డేంజర్
బంగాళాదుంపను ఏ ఇతర ఫుడ్స్‌తో కలిపి వండకూడదు. ముఖ్యంగా వీటిని ట్యూనా ఫిష్ లేదా చికెన్ బ్రెస్ట్ తో కలిపి వండకూడదు. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఫుడ్ మీ శరీరం బయటకు పంపాల్సిన ఇన్సులిన్ మొత్తాన్ని రెట్టింపు చేస్తుంది. పైన పేర్కొన్నట్లుగా బంగాళదుంపలను మీ ఆహారం నుంచి పూర్తిగా తొలగించకుండా సరైన మార్గంలో వండుతూ వాటిని ఆస్వాదించవచ్చు.

See also  పాలు మరియు ఉడికించిన బంగాళదుంపలు తినడం వల్ల 5 ప్రయోజనాలు