PMSY – Pradhan Mantri Suryodaya Yojana- కేంద్రం కొత్త స్కీమ్.. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?


Prime Minister Narendra Modi on Monday (January 22) announced the ‘Pradhan Mantri Suryodaya Yojana’, a government scheme under which one crore households will get rooftop solar power systems. This isn’t the first scheme for promoting the installation of rooftop solar power systems, though.

ప్రధానమంత్రి సూర్యోదయ యోజన స్కీమ్‌ అనౌన్స్‌ చేశారు. కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పుడు భారత్‌లో గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌పై, ముఖ్యంగా సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్‌లపై ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే.. సోలార్‌ విద్యుత్తు వినియోగం, ప్రాజెక్టుల పురోగతి తక్కువగానే ఉంది. దేశంలో ప్రస్తుతం 700,000- 800,000 గృహాలు మాత్రమే సోలార్‌ విద్యుత్తును వినియోగిస్తున్నాయి.

భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ (RTS) కెపాసిటీ 2016 నుంచి 2.7 GWకి పెరిగింది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ ఫేజ్-II కింద 40 GW రూఫ్‌టాప్ సోలార్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన (PMSY), ఈ లక్ష్యాలకు తోడ్పాటు అందిస్తుందని భావిస్తున్నారు.
అయితే అవగాహన పెరగడం, ఈజీ RTS ఫైనాన్స్ కారణంగా పెరుగుదల కనిపిస్తోంది. క్రెడిట్ ఫెయిర్ వంటి కంపెనీలు, RTS కోసం 8-10% వడ్డీకి వ్యక్తిగత రుణాలను అందజేయడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలకు దోహదపడాలని భావిస్తున్నాయి. ఈ పథకం అమలు, రుణ సాయాలు, ఖర్చులకు సంబంధించి ఫిన్‌టెక్‌ కంపెనీ క్రెడిట్ ఫెయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వికాస్ అగర్వాల్ ‘బిజినెస్ టుడే’కు తెలిపిన వివరాలు చూద్దాం.

* లక్ష్యం ఎంత దూరంలో ఉంది?

ప్రస్తుతానికి సుమారు 7-8 లక్షల కుటుంబాలు సోలార్‌ వినియోగిస్తున్నాయి. క్రెడిట్ ఫెయిర్, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వచ్చే ఐదేళ్లలో 1 మిలియన్ రెసిడెన్షియల్ రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు సహకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫోటోవోల్టాయిక్ ప్యానెల్స్, లేదా రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను మెయిన్‌ పవర్‌ సప్లైకి కనెక్ట్ చేయడం ద్వారా, గ్రిడ్-కనెక్టెడ్‌ విద్యుత్‌పై ఆధారపడటం తగ్గుతుంది. దీంతో విద్యుత్తు ఖర్చులు తగ్గుతాయి. వచ్చే ఐదేళ్లలో 40 గిగావాట్ల యాన్యువల్ పవర్‌ జనరేషన్‌ను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, 2.2 గిగావాట్లను మాత్రమే ఇళ్లలో అమర్చారు. లక్ష్యంలో 70% నెరవేరలేదు.

* ఎంత ఖర్చు అవుతుంది?

3KW- 5KW సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టలేషన్‌కు రూ.2.20 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ వ్యయాన్ని నెలకు దాదాపు రూ.4000- రూ.5000 EMI చెల్లిస్తూ తీర్చుకోవచ్చు. విద్యుత్ బిల్లులకు సమానమైన మొత్తాన్ని చెల్లిస్తూ, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. క్రెడిట్ ఫెయిర్ అందించే సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లు వినియోగదారులకు ప్రక్రియను మరింత అందుబాటులోకి తెచ్చాయి.
ప్రభుత్వ రాయితీలు ఖర్చును మరింత తగ్గిస్తాయి. గ్రిడ్ విద్యుత్ టారిఫ్ రేట్లు, ఆర్థిక ప్రోత్సాహకాలు, నెట్‌ మీటరింగ్ వంటి అంశాలు రీపేమెంట్‌కి దోహదం చేస్తాయి. నెట్ మీటరింగ్ ఉత్పత్తి చేసిన మిగులు విద్యుత్తుని తిరిగి గ్రిడ్‌లోకి మళ్లించడానికి అవకాశం ఉంటుంది. దీని కారణంగా మొత్తం విద్యుత్ బిల్లు తగ్గుతుంది.

See also  వైసీపీలో భారీ మార్పులు, చేర్పులు.. జగన్‌ చతుర్ముఖ వ్యూహం ఎలాంటి ఫలితం ఇవ్వనుంది?

* ప్రభుత్వ రాయితీలు

రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తుంది. 10kW కెపాసిటీ వరకు ఉన్న సిస్టమ్‌లకు రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ ఫేజ్-II కింద కిలోవాట్‌కు రూ.9,000 నుంచి రూ.18,000 వరకు ఇస్తుంది. 10kW సామర్థ్యం కంటే ఎక్కువ ఉన్న సిస్టమ్‌లకు సబ్సిడీ మొత్తం ఫిక్స్‌డ్‌గా రూ.1,17,000 ఉంటుంది. డిజిటల్ లెండర్స్‌ స్థానిక ఇన్‌స్టాలర్‌లతో భాగస్వామ్యం చేయడం ద్వారా ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ను సులభతరం చేయడంలో పాత్ర పోషిస్తున్నారు. క్విక్‌, ఈజీ లోన్‌లు అందిస్తున్నారు. ఉదాహరణకు, క్రెడిట్ ఫెయిర్ కంపెనీ 2300 రూఫ్‌టాప్‌లకు ఆర్థిక సహాయం చేసింది, దాదాపు రూ.12 కోట్ల వార్షిక విద్యుత్ ఖర్చులు, 13,000 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించడంతో సమానం.