PM Kisan: రైతులకు శుభవార్త.. గ్రామాల్లో అధికారుల క్యాంపులు.. ఎప్పుడంటే..!


రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింది నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 లను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ పథకం కింది 15 విడతలుగా రైతు ఖాతాల్లో రూ.30 వేలు జమ చేశారు. త్వరలో 16 విడత డబ్బులు కూడా రానున్నాయి. అయితే ఈ పథకంలో అనర్హులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ప్రతి రైతు ఈకేవైసీ చేసుకోవాలని కోరింది.

ఎప్పటి నుంచో ఈ కేవైసీ చేసుకోవాలని చెబుతోంది. అయితే ఈ పథకం వర్తించాలంటే తప్పకుండా e KYC ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ చాలా మంది ఈ కేవైసీ చేసుకోలేదు. దీంతో వారికి వచ్చే పీఎం కిసాన్ డబ్బులు ఆగిపోయాయి. ఇప్పటికైనా ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అయినప్పటికీ చాలా మందికి ఈ కేవైసీపై అవగాహన లేకపోవడంతో చేసుకోలేదు.

 

దీంతో అధికారులు గ్రామాల్లోకి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. ఈ కేవైసీ చేసేందుకు ఫిబ్రవరి 12 నుంచి 21 వరకు గ్రామాల్లో అధికారులు క్యాంపులు నిర్వహించి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇప్పటికీ కూడా ఈ కేవైసీ చేసుకోకుండా ఉన్న రైతులు గ్రామాల్లోకి అధికారులు వచ్చినప్పుడు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు. ఈకేవైసీ చేసుకోకుంటే డబ్బులు జమ కావని స్పష్టం చేస్తున్నారు.

పీఎం కిసాన్ యోజన కు సంబంధించి ఆన్ లైన్ లో ఈకేవైసీ చేసుకోవచ్చు. కానీ మీ ఆధార్ కు ఫోన్ నంబర్ లింక్ ఉంటేనే ఇది సాధ్యం అవుతోంది. ఈ ఆధార్ కు ఫోన్ నంబర్ లింక్ లేకుంటే వెంటనే మీసేవకు వెళ్లి లింక్ చేసుకోవాలి. ఆధార్ తో ఫోన్ నంబర్ లింక్ అయి ఉంటే.. మీరు pmkisan.gov.in వెబ్ సైట్ వెళ్లాలి. అక్కడ మీకు ఈ కేవైసీ అని కనిపిస్తుంది. అక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీ ఈకేవైసీ పూర్తవుతోంది.

See also  జీతాల పెంపు, రైతు రుణమాఫీపై త్వరలో సీఎం జగన్ కీలక నిర్ణయం?