*🇫🇷ఫెజంట్ ఐలాండ్: 🇪🇸* ఆరు నెలలు ఫ్రాన్స్ చేతిలో.. ఆరు నెలలు స్పెయిన్ నియంత్రణలో – దాదాపు 350 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అధికార మార్పిడి సంప్రదాయం ప్రపంచంలో విశేషమైంది.- ఈ దీవి గురించి తప్పకుండా తెలుసుకోవాలి!


Pheasant Island on the Bidasoa River between France and Spain.
ఫెజంట్ ఐలాండ్: ఆరు నెలలు ఫ్రాన్స్ చేతిలో.. ఆరు నెలలు స్పెయిన్ నియంత్రణలో – ఈ దీవి గురించి తప్పకుండా తెలుసుకోవాలి!

ఒక్క తూటా పేలకుండా, ఒక్క రక్తపు బొట్టు చిందకుండా రెండు దేశాల మధ్య అధికార మార్పిడి జరుగుతోంది. దాదాపు మూడున్నర శతాబ్దాల నుంచి శాంతియుతంగా ఒక దేశాన్ని పంచుకుంటున్నాయి స్పెయిన్, ఫ్రాన్స్‌ దేశాలు. ఈ రెండు దేశాల ఎగువ, దిగువన ఉన్న ప్రధాన భూభాగంలోని ఫెజంట్ ఐలాండ్ ఈ వినూత్నమైన అధికార మార్పిడికి వేదికైంది.

ఐరోపాలో ఆరు నెలలకోసారి దేశం మారే ఒక దీవి కథ ఇది. ప్రస్తుతం ఈ దీవి ఫ్రాన్స్ ఆధీనంలో ఉంది. ఆరు నెలల తర్వాత స్పెయిన్ అధికారంలోకి వెళ్తుంది. స్పెయిన్, ఫ్రాన్స్‌ రెండు దేశాల ప్రధాన భూభాగంలో ఉన్న ఈ సుందరమైన, ఆహ్లాదకరమైన ఫెజంట్ దీవి విస్తీర్ణం దాదాపు 3,200 చదరపు అడుగులు (355.5 చదరపు గజాలు). ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య సరిహద్దుగా ఉన్న బిడసోవా నదిలో ఉంది ఈ ఫీజంట్ దీవి. ఫ్రాన్స్ ప్రధాన భూభాగానికి దిగువన, స్పెయిన్ ప్రధాన భూభాగానికి ఎగువన ఉందీ ఫెజంట్ ఐలాండ్.

స్పెయిన్ నాలుగో రాజు ఫిలిప్ కుమార్తెను ఫ్రాన్స్ పద్నాలుగో రాజు లూయీ పెళ్లి చేసుకున్నారు. ఈ చరిత్రాత్మక ఘటనకు గుర్తుగా 1659లో స్మారక చిహ్నం

ఫెజంట్ ఐలాండ్‌పై నియంత్రణ కోసం పదహారవ శతాబ్దంలో ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య సుదీర్ఘకాలం యుద్ధం సాగింది. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు మూడు నెలలపాటు ఉభయ దేశాలు చర్చలు జరిపాయి. చర్చల అనంతరం ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీనిని ట్రీటీ ఆఫ్ ద పిరినీస్ గా పిలుస్తారు ఇరుదేశాల ప్రజలు. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు ఈ దీవిని ప్రతీ ఆరు నెలలకొకసారి మార్చుకుంటాయి. శాంతి ఒప్పందం సందర్భంగా రాజ వివాహం జరిగింది. స్పెయిన్ నాలుగో రాజు ఫిలిప్ కుమార్తెను ఫ్రాన్స్ పద్నాలుగో రాజు లూయీ పెళ్లి చేసుకున్నారు. ఈ చరిత్రాత్మక ఘటనకు గుర్తుగా 1659లో స్మారక చిహ్నం నిర్మించాయి ఇరుదేశాలు. ఈ దీవిని అనుబంధానికి ప్రతీకగా మార్చాయి. శాంతి ఒప్పందం ప్రకారం ఫెజంట్ ఐలాండ్ ఫిబ్రవరి 1 నుంచి జులై 31 వరకు స్పెయిన్ పాలనలో, ఆగస్టు 1 నుంచి జనవరి 31 వరకు ఫ్రాన్స్ ఏలుబడిలో ఉంటుంది. ప్రతి ఆరు నెలలకోసారి ఇలా అధికార మార్పిడి జరుగుతుంటుంది. ప్రపంచంలో అత్యంత సుదీర్ఘకాలంగా రెండు దేశాలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్న భూభాగాల్లో ఈ దీవి మొదటిది.

See also  Oldest Bank in World : ఇది ప్రపంచంలోనే అతి పురాతన బ్యాంకు..! డబ్బుకు బదులు విలువైన వస్తువులను ఉంచేవారు..

దాదాపు 350 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అధికార మార్పిడి సంప్రదాయం ప్రపంచంలో విశేషమైంది. ఫ్రాన్స్‌ లోని బయోనే, స్పెయిన్‌లోని సాన్ సెబాస్టియన్ పట్టణ నౌకాదళ కమాండర్లు ఫెజంట్ ఐలాండ్‌కు గవర్నర్లుగా ఉంటారు. ఫ్రాన్స్‌లోని హెండయే, స్పెయిన్‌లోని ఇరున్ పట్టణాల మేయర్లు ఈ దీవి వ్యవహారాలు చూసుకుంటారు. సంవత్సరంలో ఇంచుమించుగా పన్నెండుసార్లు సమావేశమై నీటి నాణ్యత, చేపల వేటపై హక్కులు, ఇతర అంశాలపై చర్చలు జరుపుతారు. ఇంతకుముందు ఫ్రాన్స్ పొడవాటి పడవల డిజైన్ పై స్పెయిన్ మత్స్యకారుల అభ్యంతరాలు ఉండేవి. అయితే ఎవరికి ఇబ్బంది కలుగకుండా, దీవిలోని నదికి ఎటువంటి కాలుష్యం జరుగుకుండా ఉండేందుకు పడవల డిజైన్లను మార్చారు.

ఇంత ప్రాముఖ్యత కలిగిన ఫెజంట్‌ దీవిలోమనుషులు ఉండకపోవడం విశేషం. కేవలం పగటి వేళల్లోనే ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. రాత్రివేళల్లో ఇక్కడికి పర్యాటకులను అనుమతించరు. స్పెయిన్ నుంచి నడిచి వెళ్లగలిగే ఈ దీవిలో అక్రమంగా తిష్టవేసే వారిని స్పెయిన్ పోలీసులు తరిమేస్తుంటారు. అయితే శతాబ్దాల ప్రయాణంలో ఈ దీవి విస్తీర్ణం దాదాపు సగానికి సగం తగ్గిపోయింది. పిరినీస్ పర్వతాల్లోని మంచు కరిగి బిడసోవా నదిలోకి చేరుతోంది. నదిలో ప్రవాహ మట్టం పెరిగి దీవి విస్తీర్ణం తగ్గుతుందని ప్రకృతి ప్రేమికులు విమర్శిస్తున్నారు. ఈ దీవిని రక్షించేందుకు ఫ్రాన్స్‌, స్పెయిన్ దేశాలు నిధులు వెచ్చించి చరిత్రాత్మక దీవిని కాపాడాలని పర్యాటకులు కోరుకుంటున్నారు.
గజం భూమి పక్కవాడు ఆక్రమించుకుంటేనే ప్రాణాలు తీసుకునే రోజుల్లో ఉన్నాం. అయితే ప్రపంచంలోని రెండు దేశాల ముఖ్యదేశాల మధ్య శాంతియుత, సామరస్య సంబంధాలకు నిలువెత్తు సాక్షిగా నిలిచింది ఈ ఫెజంట్‌ దీవి.

,