23మంది సిట్టింగ్‌లకు నో టికెట్.. సీఎం జగన్ వారిని ఎందుకు పక్కన పెట్టారు? మార్పు వెనుక మర్మం ఏమిటి?


CM Jagan : ఏపీలో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. ఇందుకోసం అవసరమైన వ్యూహాలు రచిస్తూ పలు కీలక మార్పులు చేపడుతున్నారు.
వై నాట్ 175 అంటున్న జగన్.. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నారు. ఇటు పార్లమెంట్, అటు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటివరకు ఇంఛార్జిల మార్పు పేరిటి మూడు జాబితాలు విడుదల చేశారు సీఎం జగన్. వీలైనంతవరకు అసంతృప్తులను బుజ్జగిస్తూ మార్పులు చేర్పులు చేపడుతున్నారు.

ఇక రాజకీయ సామాజిక సమీకరణాలతో పాటు అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తూ ఎంపిక ప్రక్రియ చేపడుతోంది వైసీపీ అధిష్టానం. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 59 చోట్ల ఇంఛార్జిలను మార్చారు. ఇందులో 9 ఎంపీ స్థానాలు, 50 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలనే పట్టుదలతో ఉన్న జగన్ చాలా చోట్ల అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఇప్పటివరకు 23 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కూడా నిరాకరించారు. ఆయా స్థానాల్లో కొత్త వారిని సైతం ప్రకటించారు. మరోవైపు మూడు ఎంపీ స్థానాల్లో కూడా అభ్యర్థులను మార్చారు జగన్.

ఓవరాల్ గా 23 సిట్టింగ్ లను పూర్తిగా పక్కన పెట్టేశారు. వారికి స్థాన చలనం లేదు. టికెట్లు కూడా కేటాయించలేదు. ఓవరాల్ గా ఈ మూడు జాబితాలను చూస్తే.. 23మంది సిట్టింగ్ లకు సీట్లు గల్లంతయ్యాయి. అలాగే ఎంపీలకు సంబంధించి కొన్ని చోట్ల అదే తరహా వాతావరణం ఉంది. ఎందుకిలా జరిగింది? సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? కొత్త వారికి ఎందుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది? దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? మార్పు వెనుక మర్మం ఏంటి?

See also  అంగన్వాడీలకు మద్దతుగా 24న రాష్ట్ర బంద్