అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి నిత్యానంద హాజరుకానున్నారా?


అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సర్వ సిద్ధమైంది. చాలా మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. కాగా.. రాముడి ప్రాణప్రతిష్ఠకు హాజరవుతున్నట్లు తెలిపారు స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక వేత్త నిత్యానంద.
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు హాజరవుతానని తెలిపారు. ప్రధాని మోడీ, యూపీ సీఎం సహా ఇతరులు పాల్గొనే వీవీఐపీ కార్యక్రమానికి ఆహ్వానం అందిందని ట్విట్టర్ లో తెలిపారు. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసలో జరిగే కార్యక్రమాల గురించి కూడా వివరించారు.

2010లో నిత్యానందపై అతని మాజీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదైంది. నిత్యానందను అరెస్టు చేసిన తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యాడు. నిత్యానంద దేశం నుంచి పారిపోయాడంటూ డ్రైవర్ కోర్టుని ఆశ్రయించడంతో.. అతడి బెయిల్ రద్దయ్యింది. దేశం వదిలి పారిపోయిన నిత్యానంద.. 2020లో తన సొంత దేశాన్ని ఏర్పరుచుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గతేడాది ఐక్యరాజ్యసమితి సమావేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధిగా మాతా విజయప్రియ నిత్యానంద వ్యవహరించారు. మరోవైపు రేప్ కేసు ఇప్పటికీ రామనగర సెషన్స్ కోర్టులో పెండింగ్ లో ఉంది.

See also  అంగన్వాడీలకు మద్దతుగా 24న రాష్ట్ర బంద్