అధిక రక్తపోటును తగ్గిస్తున్న కొత్త ఔషధం.. ఎలా పనిచేస్తుందంటే..


ప్రపంచ వ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. ముఖ్యంగా దీని కారణంగా డయాబెటిస్, హార్ట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ తలెత్తే అవకాశం ఎక్కువ.
అయితే ప్రస్తుతం అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌తో కలిసి పనిచేస్తున్న పరిశోధకులు ఇందుకు పరిష్కారాన్ని కనుగొన్నారు. ఏంటంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ద్వారా ఆమోదించ బడిన అధిక బరువు తగ్గించే కొత్త ఔషధం ‘టిర్జెపటైడ్’ ఒబేసిటీ కలిగిన వారిలో హై బ్లడ్ ప్రెజర్‌ను, సిస్టోలిక్ బ్లడ్ ప్రెజెర్‌ను కూడా సమర్థవంతంగా తగ్గిస్తుందని గుర్తించారు.

రీసెర్చర్స్ అబ్జర్వేషన్

టిర్జెపటైడ్ (tirzepatide) మెడికేషన్ అధిక బరువు గల వారిలో రక్తపోటును ఎలా కంట్రోల్ చేస్తుందో తెలుసుకోవడానికి రీసెర్చర్స్ ఒబేసిటీతో బాధపడుతున్న దాదాపు 500 మందిపై పరిశోధనలు నిర్వహించారు. అయితే ఇది అధిక రక్తపోటును, సిస్టోలిక్ రక్తపోటును గణనీయంగా తగ్గిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. నిజానికి సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ వ్యక్తి గుండె కొట్టుకున్నప్పుడు ధమనులలో ఒత్తిడిని కొలుస్తుంది. ఇది కార్డియో వాస్క్యులర్ హెల్త్‌కు కీలకమైన సూచికగా పరిగణించబడుతుంది. దీని హై రీడింగ్స్ (హైపర్‌టెన్షన్) గుండె జబ్బులు, స్ట్రోక్‌లకు ప్రధాన ప్రమాద కారకంగా ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2024 గణాంకాలు పేర్కొంటున్నాయి. యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు సగం మంది పెద్దలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని, ఊబకాయం దాదాపు 42 శాతం మందిని ప్రభావితం చేస్తుందని వెల్లడిస్తు్న్నాయి.

ఎలా పనిచేస్తుంది?

అధిక బరువును తగ్గించే న్యూ డ్రగ్ అయిన టిర్జెపటైడ్ యొక్క మెకానిజం ప్రత్యేకమైనదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది రెండు మెటబాలిక్ హార్మోన్లను అనుకరిస్తుంది. ఇన్సులిన్ స్రావంతోపాటు భోజనం తర్వాత సెన్సిటివిటీని పెంచుతుంది. పైగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా జీర్ణక్రియను నెమ్మదించడంతో ఆకలిని తగ్గిస్తుంది. ఇటువంటి చర్యలు బరువు తగ్గడానికి దారితీస్తాయి. ఈ డ్యూయల్ యాక్షన్ విధానం సెమాగ్లుటైడ్ (ఓజెంపిక్) వంటి ఇతర మందులకంటే కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ”రక్తపోటును తగ్గించడంలో సహాయపడే టిర్జెపటైడ్ యొక్క సామర్థ్యాన్ని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కూడా గుర్తించింది. 2022లో టైప్ 2 డయాబెటిస్ ట్రీట్మెంట్‌కు, 2023 చివరిలో అధిక రక్తపోటు, మధుమేహం, అలాగే అధిక కొలెస్ట్రాల్‌తో ముడిపడి ఉన్న అధిక బరువుగల వ్యక్తులలో దీర్ఘకాలిక బరువు నిర్వహణ కోసం దీనిని ఆమోదించింది” అది ఇప్పుడు అధిక రక్తపోటు, సిస్టోలిక్ రక్తపోటును కంట్రోల్ చేయడంలోనూ సహాయపడుతోంది” అంటున్నారు డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్‌లో కార్డియాలజీ పరిశోధకుడు డాజెమ్స్ ఎ.డి. లెమోస్.

See also  Low BP ఈ లక్షణాలు ఉంటే మీరు లో బీపీతో ఉన్నట్లే.. ఇది హై బీపీ కంటే డేంజర్.. వెంటనే ఇలా చేయండి
,