Moto G24 Power Sale: రూ.10 వేలలోపే 16 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ .. ఈ సూపర్ ఫోన్ కోనేసేయండి


Moto G24 Power Flipkart Sale: మోటో జీ24 పవర్ (Moto G24 Power) స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్పై ఈ ఫోన్ పని చేయనుంది.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఇన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ దీని ధర రూ.10 వేలలోపే ఉండటం విశేషం.

మోటో జీ24 పవర్ ధర (Moto G24 Power Price in India)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999గా నిర్ణయించారు. గ్లేసియర్ బ్లూ, ఇంక్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్కార్ట్, మోటొరోలా అధికారిక వెబ్ సైట్లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో దీని సేల్ ప్రారంభం అయింది.

మోటో జీ24 పవర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Moto G24 Power Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్నెస్ 537 నిట్స్గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్పై మోటో జీ24 పవర్ రన్ కానుంది. ర్యామ్ బూస్ట్ టెక్నాలజీ ద్వారా ఏకంగా 16 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే 16 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ రూ.10 వేలలోపే కొనేయచ్చన్న మాట. 3డీ ఏక్రిలిక్ గ్లాస్ బిల్డ్ను మోటో జీ24 పవర్ కలిగి ఉండటం విశేషం.

ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ ఉంది. దీంతో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 128 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. దీన్ని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, ఎల్టీఈపీపీ, ఎస్యూపీఎల్, బైదు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, వైఫై, యూఎస్బీ టైప్-సీ పోర్టు కూడా అందించారు. ఐపీ53 రేటెడ్ వాటర్ రెపెల్లెంట్ బిల్డ్తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, సెన్సార్ హబ్, ఎస్ఏఆర్ సెన్సార్ కూడా అందుబాటులో ఉన్నాయి.

See also  50MP కెమెరా,11GB RAM తో Poco C55 స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్! ధర రూ.5999 కే

బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. డాల్బీ అట్మాస్ను సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 33W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 197 గ్రాములుగా ఉంది.

,