మహేష్ ‘గుంటూరు కారం’ OTTలో షాక్ ఇచ్చే రెస్పాన్స్


సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం ఓటిటి రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే అతి తక్కువ టైమ్ లో ఓటిటిలో వచ్చేయటం ఫ్యాన్స్ కు బాధ కలిగించినా అక్కడ వ్యూయర్ షిప్ చూసి షాక్ అవుతున్నారు.
నెట్ ప్లిక్స్ వారు రికార్డ్ రేటుకు ఓ రీజనల్ సినిమాని కొన్నారు. మహేష్ కెరీర్ లోనూ ఓటిటి కు ఎక్కువ అమ్ముడైన చిత్రం ఇదే. ఈ నేపధ్యంలో ఓటిటిలో ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ సినిమాని అనేది ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు .. గుంటూరు కారం నెట్ ప్లిక్స్ లో దుమ్ము రేపుతోంది. మల్టిపుల్ లాంగ్వేజ్ లలో రిలీజైన ఈ చిత్రం టాప్ 10 లో ట్రెండింగ్ లో ఉంది. అలాగే తెలుగు వెర్షన్ సైతం నెంబర్ 1 పొజీషన్ లో ట్రెండ్ అవుతోంది. హిందీ వెర్షన్ …3 ప్లేస్ లోనూ, తమిళ వెర్షన్ 5 వ పొజీషన్ లోనూ ట్రెండ్ అవుతోంది. అతి తక్కువ టైమ్ లోనే ఈ సినిమా వ్యూయర్ షిప్ ట్రెండింగ్ లో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మహేష్ మేనియా ఇదే అంటున్నారు ఫ్యాన్స్ .

వాస్తవానికి గుంటూరు కారం తొలి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినా మహేష్ మేనియాతో వసూళ్లలో మాత్రం ఓ రేంజిలో దూసుకుపోయింది.దానికి తోడు హనుమాన్ మినహా మిగిలిన సంక్రాంతి సినిమాలు ఏవీ పోటి ఇవ్వకపోవటం గుంటూరు కారంకు కలిసివస్తోంది. మహేష్ బాబు ఛార్మ్,ఫ్యామిలీలలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ బాగా వర్కవుట్ అవుతోంది. దానికి తోడు త్రివిక్రమ్ మార్క్ సెంటిమెంట్ ఫ్యామిలీలకు నచ్చుతోంది. ఈ నేపధ్యంలో టిక్కెట్ రేట్లు కాస్త తగ్గి ఫ్యామిలీలు మరింత గా థియేటర్ కు వెళ్తారు అనుకున్న టైమ్ లో ఓటిటి రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా లో కథ ఎలా ఉన్నా…’అన్నం వద్దనుకున్నవాడు రోజంతా పస్తులుంటాడు, అమ్మని వద్దనుకున్నవాడు జీవితాంతం ఏడుస్తాడు’. ‘అమ్మ తన బిడ్డలకి ఏం చేసిందని అడగకూడదు’, ‘తద్దినం జన్మదినం రెండూ దినాలే’ తరహా సంభాషణలు ఆకట్టుకున్నాయి. అలాగే మాస్ పాత్రలో మహేశ్‌బాబు చేసే హంగామా, ఆయన ఎనర్జీ, మాస్ పాటలు, ఇంట్రవెల్ సీన్స్ , క్లైమాక్స్ సీన్స్ లో ఎమోషన్స్ ఇవే ఈ సినిమాకు బలం.గుంటూరు కారం చిత్రంలో శ్రీలలో పాటు హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అయ్యింది.. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. మహేశ్‌ – త్రివిక్రమ్‌ స్టైల్ మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందింది.

See also  Camphor: కర్పూరం తయారవుతుంది ఈ చెట్ల నుండేనని మీకు తెలుసా..? ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు
,