ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలో తెలుసుకోండి.. లేకపోతే రోగాలు వస్తాయి


ప్యాకెట్ పాలను మరగబెట్టి వాడుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం ఇబ్బందుల్లో పడ్డట్టే. ఫ్రెష్ గా ఉంటాయని మరిగించి తాగితే… శరీరానికి పోషకాలు రాకపోగా రాకపోగా…

అనేక ఇబ్బందులు తప్పవని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరం పిల్లలకు బూస్ట్, హార్లిక్స్.. బోర్నవిటా లాంటి వాటిని కూడా పాలల్లో కలిపి వేడి చేసి ఇస్తున్నారు. అంటే మీ పిల్లలకు మీరే పోషకాలు అందిచడంలో నిర్లక్ష్యం వహిస్తారన్నమాట. అదేంటి.. డాక్టర్లు పాలు తాగితే బలం అని అంటున్నారు కదా అంటారా… అయితే ఈ స్టోరీ మీ కోసమే.
అవును… ప్యాకెట్ పాలను ఎప్పుడూ మరిగించి వాడకూడదు. ఇలా చేయడం వల్ల ఆ పాలలో ఉండే అన్ని పోషక మూలకాలు నాశనం అవుతాయి. వాస్తవానికి, ఆవు లేదా గేదె నుండి తీసిన తర్వాత పాలలో కొంత బ్యాక్టీరియా ఉంటుంది. వాటిని చంపడానికి పాలు మరగిస్తారు. ప్యాకెట్ పాలతో కూడా ఇదే అలవాటును అలవర్చుకున్నాము. అయితే ఇది అస్సలు చేయకూడదు. ప్యాకెట్ పాలు కొని తీసుకొచ్చాక బాగా మరగబెట్టాకే వాటిని తాగుతున్నాం. నిజానికి ఆ పాలను మరగబెట్టాల్సిన అవసరం లేదు. మరగబెట్టి, చల్లార్చాకే వాటిని ప్యాకెట్లలో వేసి అమ్ముతారు. కాబట్టి అధిక ఉష్ణోగ్రతల వద్ద మళ్లీ మరిగించాల్సిన అవసరం లేదు. కేవలం తాగడానికి వీలుగా గోరువెచ్చగా చేసుకుంటే చాలు. ఎక్కువ కాచడం వల్ల ప్యాకెట్ పాలల్లోని పోషకాలు ఇంకా తగ్గిపోతాయి. దీంతో వ్యాధినిరోధక శక్తి తగ్గి .. రోగాలకు మనమే స్వాగతం చెబుతున్నామన్నమాట. పోషకాలు ఎందుకు తగ్గిపోతాయో తెలుసుకోవాలంటే ముందు ప్యాకెట్ పాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

పాశ్చరైజ్డ్ పాలు

ప్యాకెట్ పాలు పచ్చిపాలు కాదు. వాటిలో ఉండే హానికారక సూక్షజీవులైన కొలై, సాల్మొనెల్లా, లిస్టిరియా మొదలైన వాటిని చంపేందుకు అధిక ఉష్ణోగ్రత వద్ద మరిగిస్తారు. ఆ తరువాత చల్లార్చి ప్యాక్ చేస్తారు. కొంతమంది వీటికి విటమిన్ ఎ, డిలను జోడిస్తారు. కచ్చితంగా వీటిని చేర్చాలన్న నియమం లేదు కానీ, ఎలాంటి రసాయనాలు కలపకూడదనే కఠిన నియమం అమలులో ఉంది. ఇలా ప్యాక్ చేసిన పాలనే పాశ్చరైజ్డ్ పాలు అంటారు. వీటిని ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకుంటే రెండు రోజుల పాటు ఎలాంటి మార్పులు లేకుండా తాజాగా ఉంటాయి. ఫ్రిజ్ నుంచి బయటికి తీశాక వాటిని తిరిగి అధికంగా మరగబెట్టాల్సిన అవసరం లేకుండా గోరువెచ్చగా చేసుకుని తాగేసినా సమస్య ఉండదు. కానీ వాటిని ప్యాక్ చేసి మూడు రోజుల దాటిన తరువాత తాగాల్సి వస్తే మాత్రం కాసేపు మరిగించడం ఉత్తమం. ఇలాంటి పాలలో పేగుల ఆరోగ్యానికి అవసరమయ్యే ప్రోబయాటిక్ బ్యాక్టిరియా కూడా ఉంటుంది. ఇది అత్యవసరం. ఇక ప్యాకెట్ పాలలో పాశ్చరైజేషన్ వల్ల హానికర బ్యాక్టిరియాతో పాటూ కొన్ని మేలుచేసే బ్యాక్టిరియాలు, ఎంజైమ్ లు కూడా ఉంటాయి. మళ్లీ మరిగేంత వేడిచేస్తే అవి నాశనం అవుతాయి.

See also  Phone Tips: ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేస్తున్నారా.. బ్యాటరీ పని ఖతమే.. ఎక్కువ కాలం బ్యాటరీ పనిచేయాలంటే ఈ టిప్స్ పాటిస్తే బెటర్..!

పాల ప్యాకెట్ పై హెచ్చరికలు..

ప్యాకెట్ పాలు తెచ్చేటప్పుడు..దానిపై వ్రాసిన పదాలను చదవండి. అప్పటికే పాలు పాశ్చరైజ్ అయ్యాయని ప్యాకెట్‌పై స్పష్టంగా రాసి ఉంది. అంటే అందులో ఉండే బాక్టీరియాలన్నీ ఇప్పటికే నశించిపోయాయి. అటువంటి పరిస్థితిలో, మీరు ప్యాకెట్ పాలను కాచినప్పుడు, అందులో ఉన్న మంచి పోషకాలు నాశనం అవుతాయి. అప్పుడు ఆ పాలు తాగినా ఉపయోగం ఉండదు. ఈ కారణంగా, మీరు తదుపరి సారి నుండి ప్యాకెట్ పాలను ఉపయోగించినప్పుడు, దానిని ఉడకబెట్టవద్దు. ఈ పాలు ప్యాకెట్ నుండి నేరుగా తాగడానికి సరైనది. పాశ్చరైజేషన్ వల్ల కొన్ని మేలుచేసే బ్యాక్టిరియాలు, ఎంజైమ్ లు కూడా నాశనం అవుతాయి. ముఖ్యంగా ప్రోబయాటిక్ లు దాదాపు కనుమరుగవుతాయి. వాటిని మళ్లీ మళ్లీ మరగబెట్టడం మిగిలిన పోషకాలు కూడా నశించే అవకాశం ఉంది.

శుభ్రం చేసిన తరువాతే ప్యాకింగ్
పాలకేంద్రాల వాళ్ళు అర్బన్ ఏరియాల్లో కంటే రూరల్ ఏరియాల్లో ఎక్కువగా పాలు సప్లై చేస్తారు. అంటే.. దీని అర్థం పాలు చెడ్డవనో.. అందులో పోషకాలు లేవనో కాదు.. పశువుల కొట్టం దగ్గర్నుంచి పాల సేకరణ వరకూ శుభ్రంగా ఉండాలి.. అప్పుడే ఆ పాలు అమృతంతో సమానంగా ఉంటాయి. అలా కాకుండా ఏ మాత్రం తేడా జరిగినా అవే విషంగా మారతాయి . పాల వ్యాపారులు పాలల్లో నీళ్లు కలిపి విక్రయించడం వల్ల జనాలు ప్యాకెట్ పాలకు అలవాటు పడ్డారు. ప్యాకెట్ పాలను పాశ్చరైజ్డ్ చేసి ( శుభ్రం) ప్యాక్ చేస్తారు.

నేరుగా గేదె పాలు తీసుకొంటే మరగబెట్టాలి…

పశువుల కొట్టాం దగ్గరి నుంచి తీసుకొచ్చిన పాలల్లో కొన్ని రకాల హానికర బ్యాక్టీరియాలు ఉంటాయి. కీటకాలు ఉండి ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయి. ఇవి కంటకి కనపడకుండా పాలల్లో మిక్స్ అయి ఉంటాయి. వీటిని నేరుగా తాగితే ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల వీటిని మరగబెట్టిన తరువాతే ఉపయోగించుకోవాలి. ఇలాంటి పాలను పాల కేంద్రాలకు తీసుకెళ్లి అక్కడ పాశ్చరైజ్ చేసి ప్యాకింగ్ చేస్తారు. ప్యాకెట్ పాలు ఒకసారి మరగబెట్టి ఉంటాయి. మరల మరగబెడితే ఆరోగ్యానికి ఉపయోగపడే ఎంజైమ్ లు నశిస్తాయి.