కామారెడ్డి ఎంఎల్ఎ సంచలన నిర్ణయం


కామారెడ్డి బిజెపి ఎంఎల్ఎ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరో సంచలనానికి తెర తీశారు. ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకు కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేశారు.నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఫిర్యాదు పెట్టెలను పంపించారు.
పది రోజులకు ఒకసారి తానే స్వయంగా వచ్చి వాటిని తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు తనకోసం వేచి చూడకుండా సులువుగా పరిష్కారం లభించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.వెంకటరమణారెడ్డి తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

See also  బాల్కసుమన్‌పై కేసు నమోదు.. మాజీ ఎమ్మెల్యే కోసం గాలిస్తున్న పోలీసులు