Joint Pains:కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులను తగ్గించే ఈ పండును అసలు మిస్ చేసుకోవద్దు


Pomelo Fruit Benefits In telugu : మొక్కలు అనేవి ప్రకృతి ప్రసాదించిన వరం. సీజనల్ గా దొరికే పండ్లను తింటూ ఆ సీజన్ లో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.
అలా ఈ సీజన్ లో దొరికే సిట్రస్ జాతికి చెందిన పంపర పనస పండులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పులుపు, వగరు, తీపి రుచుల కలయికతో ఉండే ఈ పండు రెండు రంగుల్లో ఉంటుంది. దానిమ్మ గింజల రంగు తొనలు లేదా తెల్లని తొనలు ఉంటాయి. ఈ పండును మహిళలు ప్రతి రోజు తింటే వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి రావు. ముఖ్యంగా అస్థియో ఫ్లోరోసిస్, కీళ్ల నొప్పులు వంటివి రాకుండా ఉంటాయి.

డయబెటిస్ ఉన్నవారికి ఈ పండు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అధిక బరువు తగ్గటానికి, కాలేయ సమస్యలు లేకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరం అంతా రక్త ప్రసరణ బాగా జరిగేలా చేయటమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంచేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది.
జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడూ పంపర పనస తోనలను తింటే కేవలం 5 నిమిషాల్లోనే కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. పంపర పనసను జ్యూస్ రూపంలోను, సలాడ్ రూపంలోను తీసుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

See also  Jaggery : రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిన్న బెల్లం ముక్కను తింటే.. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా..?