Jio: జియో ఫైబర్ గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి ఈ టీవీ, డిస్కవరీ తెలుగు ఛానల్స్


దేశవ్యాప్తంగా టెలికాం రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన జియో తక్కువ ధరకు ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి మిగతా ఆపరేటర్లను పీకల్లోతు నష్టాల్లోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
జియో రాకతో ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌, బీఎస్ఎన్ఎల్‌ల పరిస్థితి దినదినగండం నూరేళ్ల ప్రాయం అన్న చందాన తయారైంది. అదే కోవలో ఇంటింటికి బ్రాడ్ బ్యాండ్ సేవలు అంటూ ప్రకటించిన జియో (Jio Fiber) మరో పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో అప్పటివరకు ఆఫీసులకు, ఇండ్లకు ఇంటర్నెట్ అందజేసిన యాక్ట్ , భీమ్‌, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌, బీఎస్ఎన్ఎల్ ఫైబర్‌ ఆపరేటర్లకన్నా తక్కువ టారీఫ్‌కే సేవలను అందిస్తూ ఫైబర్ నెట్‌ సేవల్లో ముందు వరుసలో నిలుస్తోంది.

గిగా ఫైబర్ (Jio Fiber) అంటూ మార్కెట్‌లోకి వచ్చిన జియో తక్కువ పోటీ ఆపరేటర్లకు కన్నా తక్కువ ధరకే ఇంటర్నెట్ అందజేస్తూ డీటీఎచ్, ల్యాండ్‌లైన్ ఫోన్‌ సేవలను కలిపి అందిచడంతో చాలా మంది జియో వైపు మళ్లారు. దీంతో పొటీ ఆపరేటర్లు కూడా జియో (Jio Fiber) మార్గంలోకి వచ్చి ఈ తరహాలోనే డీటీఎచ్ సౌకర్యాలను అందిస్తున్నాయి. ఇక అప్పటి నుంచి వీటి మధ్య తీవ్ర పోటీ నెలకొనడమే కాకుండా కస్టమర్లను ఆకట్టుకునేందుకు, వారిని నిలుపుకునేందుకు నిత్యం ప్రత్యేక ఆపర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జియో ఫైబర్ (Jio Fiber) తెలుగు యూజర్లకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు అమెజాన్‌, హాట్‌స్టార్‌, జీ 5, సన్ నెక్ట్స్ , నెట్‌ఫ్లిక్స్‌, మరో నాలుగైదు ఓటీటీ ఫ్లాట్‌ఫాంలన్నింటినీ సెటాఫ్ బాక్స్ (Jio Fiber STB) ద్వారా అందజేస్తున్న జియో కొద్ది నెలల క్రితం నుంచి జియో టీవీ ఫ్లస్ యాప్ ద్వారా లైవ్ టీవీ ఛానళ్ల ప్రసారాలను ఆధునీకరించి టెలీకాస్ట్ చేస్తోంది.

అయితే వీటిలో ఇప్పటివరకు తెలుగు ఈ టీవీ ఛానళ్లు ప్రసారం కాకపోవడంతో చాలా మంది ఈ టీవీ (E TV) అభిమానులు, టీవీ ప్రేక్షకులు నిరూత్సాహ పడ్డారు. ఇన్నాళ్లకు వారి నిరీక్షణకు తెర దించుతూ రెండు రోజుల క్రితం నుంచి ఈ టీవీ నెట్ వర్క్‌లోని ఈ టీవీ (ETV) 1412, ఈ టీవీ సినిమా (ETV Cinema) 1440, ఈ టీవీ తెలంగాణ (ETV Telangana)1464, ఈ టీవీ ఆంధ్రప్రదేశ్ (ETV Andhra Pradesh) 1457, ఈ టీవీ ఫ్లస్ (ETV Plus) 1417, ఈ టీవీ లైఫ్ (ETV Life) 1451, ఈ టీవీ అభిరుచి (ETV Abhiruchi) 1453 నెంబర్లలో ఛానళ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

See also  Mobile Settings:మీ ఫోన్ లో సిగ్నల్ ప్రాబ్లమా.4 సెట్టింగ్స్ చేయండంతే..!

ఇవన్నీ జియో సెటాఫ్ బాక్సు ((Jio Fiber STB)లో జియో ఫ్లస్ యాప్‌లో ఇప్పుడు ప్రసారం అవుతున్నాయి. వీటితో పాటు డిస్కవరీకి సంబంధించిన అన్ని ఛానళ్లు 714 నంబర్ నుంచి మొదలు యానిమల్ ప్లానెట్‌తో సమా పోగో, కార్టూన్ నెట్‌వర్క్‌, టీఎల్సీ, యూరో స్పోర్ట్స్ వంటి 13 ఛానళ్లు నూతనంగా వచ్చేశాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు జియో ఫైబర్ సెటాఫ్ బాక్స్‌ ఉంటే ఇప్పుడే జియో ఫ్లస్ యాప్‌లో సెర్చ్ అప్షన్‌లో ఈ టీవీ అని టైపు చేసి మీకు నచ్చిన ఈ టీవీ ఛానల్‌ని చూసేయండి.

,