Jaggery Chapati: బెల్లం చపాతీల గురించి తెలుసా? ముఖ్యంగా చలికాలంలోనే వీటిని ఎందుకు తింటారంటే..!


చలికాలంలో శరీరం వెచ్చగా ఉండటం ఎంతో ముఖ్యం. బయటి వాతావరణానికి తగినట్టు శరీరం ఉష్ణాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే దానికి తగినట్టే ఆహారం తీసుకోవాలి.

చాలా ప్రాంతాలలో చలికాలంలో బెల్లం చపాతీలు తయారు చేసుకుని తింటారు. ఇవి తినడం వల్ల రుచి మొగ్గలు సంతృప్తి చెందడమే కాకుండా శరీరానికి వెచ్చదనం లభిస్తుందని చెబుతారు. సాంప్రదాయ ఆహారమైన బెల్లం చపాతీలు ఎలా తయారు చెయ్యాలో.. బెల్లం చపాతీలు తింటే కలిగే లాభాలేంటో తెలుసుకుంటే..

బెల్లం చపాతీలు తయారుచేసే విధానం..

బెల్లం చపాతీలు తయారుచేయడం చాలా సులభం. దీనికి కావలసిన పదార్థాలు ఇవీ..

గోధుమపిండి
బెల్లం
నెయ్యి
నువ్వులు
వేడినీరు
ఉప్పు.

గోధుమ పిండిలో అన్ని పదార్థాలు వేసి సాధారణంగా చపాతీలు తయారు చెయ్యడానికి పిండిని ఎలా కలుపుతారో అలా కలపాలి. ఈ పిండిని మరీ ఎక్కువగా పిసికి కలపడదు. ఇలా కలిపిన పిండి మీద తడిబట్ట కప్పి 15నిమిషాలు పక్కన ఉంచుకోవాలి.

15నిమిషాల తరువాత చపాతీలలాగా ఒత్తుకుని పెనం మీద మీడియం మంటలో నూనె లేదా నెయ్యి వేసి కాల్చుకోవాలి. వేడి వేడిగా ఉన్న బెల్లం చపాతీలను నెయ్యి లేదా తేనెతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. లేకపోతే ఉట్టివే తినేయచ్చు.

బెల్లం చపాతీల ప్రయోజనాలు..

బెల్లం చపాతీలు సహజమైన తీపితో చాలా రుచికరంగా ఉంటాయి. తీపి తినాలనేవారికి ఇవి తృప్తిని ఇస్తాయి. పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ తో పాటు ముఖ్యమైన ఖనిజాలన్నీ లభిస్తాయి. బెల్లంలో చక్కెరలు శరీరాన్ని తక్షణ శక్తని ఇస్తాయి.

బెల్లం చపాతీలు నెయ్యితో తయారుచేసి తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. నెయ్యి రుచిని పెంటడమే కాకుండా ఉష్ణోగ్రతను బ్యాలెన్డ్ గా ఉంచుతుంది. ఇందులో ఉపయోగించే నువ్వులు కూడా దీనికి దోహదం చేస్తాయి.

గోధుమపిండిలో ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎక్కువసేపు ఆకలిని నియంత్రిస్తుంది. విటమిన్-బి, ఐరన్ వంటి పోషకాలను అందిస్తుంది.
బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. చలికాలపు సీజనల్ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.

See also  Hair Tips : ఈ కొబ్బరి చిప్ప జుట్టుని నల్లగా మార్చడమే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు. మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.