ఈ ఆలయంలో బొట్టు పెడితే.. కోరిన కోరికలన్నీ తీరుతాయట..


ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందట. అయితే ఆ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. చతుర్భుజాలతో దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీర్చే కొంగుబంగారమైన ఇష్టకామేశ్వరి ఆలయం ( Ishtakameshwari Temple ) ఎక్కడ ఉందంటే?
దాని ప్రాముఖ్యత ఏమిటి? అన్న విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ అమ్మవారు అడవిలో కొలువై ఉన్నారు. రాళ్లు, ముళ్ళు దాటి ప్రయాణం చేయాల్సి వచ్చినా కూడా భక్తులు ఈ అమ్మవారి దగ్గరకు వెళుతూ ఉంటారు.

ఎందుకంటే మనసులో ఎంతో భారంతో, కష్టంతో అక్కడికి వెళ్లి అమ్మను దర్శించుకుని వచ్చాక ఆ సమస్యలు వెంటనే తీరిపోతాయని, లేదా వాటిని ఎదుర్కునే శక్తి కూడా వస్తుందని భక్తులు చెబుతున్నారు.

కాబట్టి అమ్మవారిని ఇష్టకామేశ్వరి అని కూడా పిలుస్తారు. ఇక శ్రీశైలం మల్లన్నకు ( Srisailam Mallanna )చేరువలో ఈ అమ్మవారి దేవాలయం కొలువై ఉంది. శ్రీశైలం నుండి దోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం ఉంది. ఇక దట్టమైన నల్లమల్ల అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి భక్తులు చేరుకుంటారు.

ఇక పక్షుల కిలకిల రాగాలు, జలపాతాల మధ్య సాగే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. అయితే ఈ ఆలయంలో అమ్మవారు 4 చేతులతో దర్శనమిస్తుంది. ఇక రెండు చేతులతో తామర పువ్వులు, మిగిలిన రెండు చేతుల్లో జపమాల, శివలింగం ధరించి కనిపిస్తుంది. ఇక విష్ణు ధర్మోత్తర పురాణంలో పార్వతి దేవి రుద్రాక్ష మల శివలింగాన్ని ధరించి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

అయితే ఇష్టకామేశ్వరి పార్వతి దేవి స్వరూపంగా కొలుస్తారు. ఆమెకు కుంకుమ పెట్టి మనసులో కష్టాన్ని, కోరికను చెప్పుకుంటే 41 రోజుల్లో నెరవేరుతుందట. ఇక ఈ ఆలయంలోని అమ్మవారి కి బొట్టు పెట్టినప్పుడు విగ్రహం మామూలుగానే ఉన్నా కూడా నుదురు మాత్రం మెత్తగా అనిపిస్తుందని కూడా చెబుతున్నారు.
సాయంత్రం 5 దాటితే ఎవ్వరిని కూడా ఆలయంలోకి ప్రవేశించరు. ఇక చిన్న గుహలో ఉండే అమ్మవారిని దర్శించుకోవాలంటే పాకుతూ వెళ్ళాలి. ఎందుకంటే గర్భగుడిలో కేవలం నలుగురు మాత్రమే కూర్చునే వీలు ఉంటుంది.

See also  Charana Paduka: అయోధ్య రాములోరికి అతి సూక్ష్మ స్వర్ణ పాదుకలు.. స్వర్ణకారుడి అపురూప సృష్టి