IRCTC Tour Packages: నేపాల్ దేశానికి ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ.. అతి తక్కువ ధరలోనే చుట్టేసి రావొచ్చు..


ఏదైనా సమీపంలోని వేరే దేశానికి టూర్ వెళ్లాలని భావిస్తున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి వీసా సమస్యలు లేని ఓ ఆప్షన్ మనకు అందుబాటులో ఉంది. అదే నేపాల్. మన దేశంలో సరిహద్దు పంచుకునే ఈ దేశం మంచి టూరిస్ట్ స్పాట్. చుట్టూ మంచు కొండలు, పచ్చందాలు, జలపాతాలతో ప్రకృతి రమణీయతతో చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడకు వెళ్లాలనుకునేవారికి ఐఆర్ సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది. అతి తక్కువ ధరలోనే మీరు నేపాల్ లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్లను చుట్టేసి రావొచ్చు. ఖాట్మాండు, పోఖారా వంటి ప్రాంతాలకు వెళ్లి రావొచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
టూర్ ప్యాకేజీ పేరు.. ఐఆర్సీటీసీ అందిస్తున్న నేపాల్ టూర్ ప్యాకేజీ పేరు నేచురల్లీ నేపాల్. ఈ ప్యాకేజీలో ఖాట్మాండు, పొఖారా ప్రాంతాలను చుట్టి రావొచ్చు. ప్రయాణికులను విమానంలో తీసుకెళ్లి తీసుకొస్తారు.
ప్యాకేజీలో ఏముంటాయి.. ఈ నేపాల్ టూర్ ప్యాకేజీలో వివరాలు పరిశీలిస్తే, ప్యాకేజీలో ప్రయాణికులకు ఉచితి వసతి, ఆహార ఏర్పాట్లు ఉంటాయి. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు నేపాల్లో మీరు ప్రయాణిస్తారు. అక్కడి వసతి, ఆహారం ప్యాకేజీలో కవర్ అవుతాయి.
ప్రయాణ తేదీ.. ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 24న ముగుస్తుంది. టూర్ ప్యాకేజీలో ప్రయాణికులకు ఉచిత అల్పాహారం, రాత్రి భోజనం లభిస్తుంది
ప్యాకేజీ ధరలు.. ఈ టూర్ ప్యాకేజీలో ఒంటరిగా ప్రయాణిస్తే రూ.55,100 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఇద్దరు వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తే ఒక్కో వ్యక్తికి రూ.47,000 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ముగ్గురితో కలిసి ప్రయాణిస్తే ఒక్కో వ్యక్తికి రూ.46,200 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
పిల్లలకు టికెట్ ధరలు.. 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలతో ఒక పడక సదుపాయం ఉన్న టూర్ ప్యాకేజీలో ప్రయాణిస్తే, మీరు రూ. 44,600 చెల్లించాలి. కాగా, 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు బెడ్ లేకుండా ధర రూ.43,400 చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలకు టికెట్ ధరలు.. 2 నుంచి 4 ఏళ్లలోపు పిల్లలకు రూ.32,000 చెల్లించాల్సి ఉంటుంది. పర్యాటకులు ఐఆర్ సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.

See also  షర్మిల కుమారుడి వివాహ వేడుకకు జగన్‌ దూరం
,