Internet speed: నెట్ స్లోగా వస్తుందా?.. రౌటర్ ను ఇలా వాడితే నెట్ స్పీడ్ పెరుగుతుంది..


మాములుగా ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది.. దాంతో ఎక్కువ మంది వైఫై కనెక్షన్స్ ను తీసుకుంటున్నారు.. అయితే ఫైబర్ కనెక్షన్స్ ఇంటర్నెట్ కొన్నిసార్లు చాలా స్లో అవుతుంది..
దాంతో అనుకున్న పని పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు.. అంతేకాదు ఏదైనా ఇంటర్నెట్‌కి సంబంధించిన పనిచేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు మీరు పనిని పూర్తి చేయలేరు. వెంటనే మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ అవసరం. మీరు ఈ సమస్యను నివారించాలంటే WiFi రూటర్‌ని సరైన దిశలో అమర్చాలి. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం…

మీరు ఇంటిలోని హాల్ ప్రాంతంలో WiFi రూటర్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. దీనివల్ల దాదాపు ఇంటిలోని ప్రతి మూలలో మీరు ఇంటర్నెట్ స్పీడ్‌ను పొందుతారు. వాస్తవానికి వైఫై రూటర్‌ని బహిరంగ ప్రదేశంలో ఇన్‌స్టాల్ చేయడం వల్ల వైఫై పరిధి పెరుగుతుంది.. ఒక గదిలో రౌటర్ ను పెడితే మిగిలిన అన్నీ గదుల్లోకి రాకపోవచ్చు..అందుకే మంచి కనెక్టివిటీ కావాలంటే తప్పనిసరిగా ఇంట్లోని హాల్ ప్రాంతంలో WiFi రూటర్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.

అలాగే మీరు 3 అంతస్తులు లేదా అంతకంటే ఎక్కువ ఇంటిలో నివసిస్తుంటే ఇంటిలోని ప్రతి అంతస్తులో అద్భుతమైన కనెక్టివిటీని కోరుకుంటే WiFi రూటర్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. రూటర్ స్థానాన్ని సరైన స్థలంలో సెట్ చేస్తే బహుళ-అంతస్తుల ఇంట్లో కూడా మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందవచ్చు..మీరు ఇందుకు ఏం చెయ్యాలంటే.. పై అంతస్తు, దిగువ అంతస్తు రెండూ మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీని కలిగి ఉంటాయి. ఇంటి మొత్తానికి ఇంటర్నెట్‌ స్పీడును పెంచినవారు అవుతారు..

See also  Formative Assessment -3 Principles of valuations.