లక్ష పెడితే కోటి 70 లక్షలు.. ఈ షేరుపై ఓ కన్నేసి ఉంచండి


మార్కెట్ లో ఉండే మల్టీబ్యాగర్ స్టాక్స్ లక్షలకు కోట్ల రూపాయలు చేసిన సందర్భాలు బోలెడు. ఆ లిస్ట్ లో ఉన్న ఓ మల్టీబ్యాగర్ షేరు గురించి ఇప్పుడు చూద్దాం.
స్టాక్ మార్కెట్ (Stock Market) కొన్ని షేర్లు ఊహించని రేంజ్ లో లాభాల పంట పండిస్తుంటాయి. ఇన్వెస్టర్లకు సిరుల పంట పండిస్తుంటాయి. మార్కెట్ లో ఉండే మల్టీబ్యాగర్ స్టాక్స్ లక్షలకు కోట్ల రూపాయలు చేసిన సందర్భాలు బోలెడు. ఆ లిస్ట్ లో ఉన్న ఓ మల్టీబ్యాగర్ షేరు గురించి ఇప్పుడు చూద్దాం.
ఓలెక్ట్రా గ్రీన్ టెక్ అనే కంపెనీ షేరు మదుపరులకు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది. కేవలం 10 ఏళ్లలో లక్ష రూపాయలను కోటి 70 లక్షలు చేసింది. దీంతో ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన వారు తెగ సంబరపడిపోతున్నారు.
2014 సంవత్సరంలో 10 రూపాయలు ఉన్న ఈ షేరు ప్రస్తుతం అంటే 2024 జనవరి నాటికి 1780 రూపాయలకు ఎగబాకింది. అంటే ఆ రోజు లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొన్న వారికి నేడు ఒక కోటి 70 లక్షల రూపాయలు రానున్నాయి.
ఇలా డబ్బుకు రెక్కలు తొడగాలంటే స్టాక్ మార్కెట్ ఉత్తమమైన మార్గం అని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. అక్కడ బండ్లు ఓడలు అవుతాయి. అలాగే ఓడలు బండ్లు కూడా కావొచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అనేది భారీ రిస్క్ తో కూడుకున్న పనే అయినా.. ఒక్కోసారి డబ్బు ప్రవాహంలా ఇంటికి చేరుతుంది.
ఓలెక్ట్రా గ్రీన్ టెక్ అనే కంపనీ ప్రొఫైల్ చూస్తే.. ఇది EV సెగ్మెంట్ లో ఉంది. ఈ కంపెనీ ఎలెక్ట్రిక్ బస్సులను తయారు చేస్తుంది. గ్రీన్ ఎనర్జీ డెవెలప్‌మెంట్‌లో కీలక భూమిక పోషిస్తోంది ఈ కంపెనీ. ఈ షేర్లు రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చని అంచనా.
గత మూడేళ్ళుగా చూస్తే భారత స్టాక్ మార్కెట్ ఉవ్వెత్తున ఎగిసింది. ప్రస్తుతం నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్ టైం హైలో ఉన్నాయి. వరల్డ్ మర్కెట్స్ లో మూడో స్థానానికి ఎగబాకింది. ఇటీవలే ఈ ఘనత సాధించింది ఇండియన్ స్టాక్ మార్కెట్.
Disclaimer: ఇక్కడ పేర్కొన్న స్టాక్‌లు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మీరు వీటిలో దేనిలోనైనా డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా ధృవీకరించబడిన పెట్టుబడి సలహాదారుని సంప్రదించండి. మీకు కలిగే లాభానికి లేదా నష్టానికి News18 బాధ్యత వహించదు.

See also  ఆర్‌బీఐ రూల్స్‌ : క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగిస్తున్నారా?,అయితే ఇది మీకోసమే!