నువ్వు పవన్ కల్యాణ్‌ అయితే .. నేను మేడా.. మేడా శ్రీనివాస్‌


గాజు గ్లాస్ సింబల్‌ నాదే అంటున్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేత మేడా శ్రీనివాస్‌. అవసరమైతే సుప్రీం కోర్టులో తేల్చుకుంటానంటున్నారు. “1998లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది.
గ్లాస్ గుర్తు మా పార్టీకే కేటాయించాలి. ఏ పార్టీకైనా 6 శాతం ఓటింగ్ వస్తేనే శాశ్వత సింబల్‌ ఇస్తారు. జనసేన పార్టీకి 6 శాతం ఓట్లు కూడా రాలేదు. గ్లాస్ గుర్తు కేటాయించాలని మే 2023న మేము అప్లయ్ చేస్తే.. జనసేన డిసెంబర్లో అప్లయ్‌ చేసింది. గుర్తు కేటాయింపులో ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించింది. ఎన్నికల సంఘం అధికారులు పవన్ కల్యాణ్ మీద ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు. చట్టం ఎవరికైనా సమానమే. న్యాయ వ్యవస్థపై, చట్టాలపై మాకు గౌరవముంది, నమ్మకముంది. జనసేనకు చెందిన నాయకులు కొందరు నన్ను సంప్రదించారు. మాట్లాడుకుందాం అన్నారు. కానీ నేను ఒకటే చెప్పా. ఏదైనా న్యాయ బద్ధంగా తేల్చుకుందాం అన్నా”. గాజు గ్లాసు గుర్తు కోసం చివరి క్షణం వరకు పోరాడుతా అన్నారు మేడా శ్రీనివాస్.
“జనసేనకు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌కు పోలికేంటి. అది సినిమా గ్లామర్‌ నుంచి వచ్చిన పార్టీ, మాది ప్రజాపార్టీ. మేం 26 ఏళ్లుగా ప్రజా ఉద్యమంలో ఉన్నాం. పవన్ కల్యాణ్‌ పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ ఉందని మేం అనుకోం. కానీ, మా పార్టీ అలా కాదు. మా పార్టీకంటూ స్పష్టమైన సిద్ధాంతాలున్నాయి. మా వెనకాల ఎవరో ఉన్నారని దుష్ప్రాచారం చేస్తున్నారు. మా వెనకాల చట్టాలున్నాయి, ప్రజలున్నారు. కానీ, పవన్ కల్యాణ్ వెనుక ఎవరున్నారో అందరికి తెలుసు. ఎన్నికలొచ్చినప్పుడే పవన్ కల్యాణ్‌ కనిపిస్తాడు”. కానీ మేం 365 రోజులు ప్రజల్లోనే ఉంటామన్నారు మేడా శ్రీనివాస్.

See also  NPS New Rules: పెన్షన్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్.. ఇప్పుడే తెలుసుకోండి.