మన భూమి లోతు ఎంత ? అలా తవ్వుకుంటూ పోతే ఎంత లోతు వరకు వెళ్లగలం?


How deep is our earth? How deep can you go if you don’t dig like that?

మన భూమి లోతు ఎంత ? అలా తవ్వుకుంటూ పోతే ఎంత లోతు వరకు వెళ్లగలం? 1989 అప్పటి సోవియట్ కు చెందిన సైంటిస్టులు భూమిని ఎంతవరకు తవ్వగలమోనని ప్రయోగం చేశారు. అప్పుడున్న టెక్నాలజీతో వాళ్లు 12 కిలోమీటర్ల 262 మీటర్ల వరకే మాత్రమే తవ్వగలిగారు. ఆ తర్వాత భూమి నుంచి రిలీజైన టెంపరేచర్ కారణంగా ఆ పనులను అక్కడే వదిలేశారు. దాదాపు 19 ఏళ్ల పాటు డ్రిల్లింగ్ ద్వారా తవ్వారు. ఇక మరింత లోతు తవ్వటం సాధ్యం కాదని అర్థం కావటంతో 2008 లో దాన్ని మూసేశారు.

కానీ భూమి లోతుతో పోల్చుకుంటే మనం తవ్వింది చాలా తక్కువ. ఎర్త్ మీద ఉండే క్రస్ట్ ఒక్కటే 70 కిలోమీటర్ల లోతు ఉంటుంది. సరిగ్గా భూమి మధ్య భాగంలోకి వెళ్లాలంటే 6, 371 కిలోమీటర్లు తవ్వాలి.

భూమికి మరో పక్కకు వెళ్లాలంటే 12, 742 కిలోమీటర్లు ఉంటుంది. అటు నుంచి ఇటు పూర్తిగా తవ్వగలిగితే గంట 40 నిమిషాల్లో ఆ వైపుకు చేరవచ్చు. కానీ అది అంతా ఈజీ కాదు. ఎందుకంటే భూమి లోపలికి వెళ్లే కొద్దీ టెంపరేచర్, ప్రెజర్ భారీగా పెరుగుతుంది.

అది ఏ స్థాయి లో ఉంటుందంటే భూమి సెంటర్ పాయింట్ లో 6000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ ఎలాంటి వస్తువైనా సరే కరిగిపోవాల్సిందే. ఇక ప్రెజర్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రతి 30 ఫీట్లకు 14 పీఎస్ఐ యూనిట్ల ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. సెంటర్ పాయింట్ లో ఉండే ప్రెజర్ ఎంతో తెలుసుకుంటే అమ్మో అంటారు. అవును ఇక్కడ భూమిపై కన్నా 3 వేల మిలియన్ల రెట్ల ఎక్కువ ప్రెజర్ ఉంటుంది.

See also  PAN Card: ఈ ట్రిక్‌ తెలిస్తే పాన్‌ కార్డు నంబర్‌ను అస్సలు మర్చిపోరు!