మధుమేహులకు వరం తేగలు.. రోజు తిన్నారంటే ఆరోగ్యానికి తిరుగే ఉండదు


చలికాలంలో విరివిరిగా కనిపించే వాటిలో తేగలు ఒకటి. తాటి టెంకలు నాటితే వచ్చే మొలకలనే తెగలు అని పిలుస్తాము. పిల్లల నుంచి పెద్దల వరకు తేగలను ఎంతో ఇష్టంగా తింటుంటారు.
ముఖ్యంగా కాల్చిన తేగలు చాలా రుచికరంగా ఉంటాయి. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. కానీ తేగల్లో పోషకాలు మాత్రం మెండుగా నిండి ఉంటాయి. క్యాల్షియం, పొటాషియం, ఐరన్‌, విటమిన్ సి, విటమిన్ బి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తేగల్లో లభిస్తాయి.

అలాగే తేగల్లో ( palm sprouts ) ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల తేగలు ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి. ముఖ్యంగా మధుమేహులకు తేగలు ఒక వారం అని చెప్పుకోవచ్చు. మధుమేహం వ్యాధి ( Diabetes )ఉన్న వారు ఈ చలికాలంలో దొరికే తేగలను కాల్చి నిత్యం తీసుకోవచ్చు. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి.

అలాగే తేగల్లో కాల్షియం( Calcium ) పుష్కలంగా ఉంటుంది. తేగలను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎముకల బలహీనత దూరం అవుతుంది. బోన్స్ సూపర్‌ స్ట్రాంగ్ గా మారుతాయి. వయసు పైబడిన సరే మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. రక్తహీనత( anemia ) ఉన్నవారు ఈ చలికాలంలో క్రమం తప్పకుండా తేగలను తీసుకునేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే తేగల్లో ఐరన్ కంటెంట్‌ రిచ్ గా ఉంటుంది. అందువల్ల తేగలను తింటే రక్తహీనత సమస్య పరార్ అవుతుంది. తేగల్లో పిండి పదార్థాలతో పాటు పీచు పదార్థం కూడా ఉంటుంది. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి తేగలు ఉత్తమమైన ఆహారంగా చెప్పుకోవచ్చు. కాల్చిన లేదా ఉడికించిన తేగలను తింటే త్వరగా ఆకలి వేయదు. ఆకలిని నియంత్రించే శక్తి తేగలకు ఉంటుంది.
మరొక ఆసక్తికర విషయం ఏంటంటే తేగలు బ్లడ్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధి వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఈ చలికాలంలో దొరికే తేగలను అసలు వదిలి పెట్టకండి.

See also  Boiled Banana: అరటిపండు ఉడకబెట్టుకుని తింటే ఈ రోగాలన్నీ నయమవుతాయ్