‘PM Surya Ghar: Muft Bijli Yojana’ ఉచిత కరెంట్‌ కోసం అప్లయ్‌ చేశారా?, లేదంటే ఇలా చేయండి..


దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. సోలార్‌ పవర్‌ వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రధాని మోదీ ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ పథకంలో ప్రతి నెలా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను అందించనున్నట్లు తెలిపారు.

ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ప్రోత్సహించాలని మోదీ అన్నారు. అదే సమయంలో, ఈ పథకం మరింత ఆదాయానికి, తక్కువ విద్యుత్ బిల్లులకు, ప్రజలకు ఉపాధి కల్పనకు దారి తీస్తుంది అని చెప్పారు.

ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఇందుకోసం ఎలాంటి పత్రాలు కావాలో తెలుసుకుందాం

♦ ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి.

♦ అప్లయ్‌ ఫర్‌ రూఫ్‌టాప్ సోలార్ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి

♦ మీరు ఈ వివరాలతో ముందుగా నమోదు చేసుకోవాలి – రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, విద్యుత్ వినియోగదారు సంఖ్య, మొబైల్ నంబర్, ఇమెయిల్ వివరాల్ని నమోదు చేయాలి.

♦ పూర్తి చేసిన తర్వాత, మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

♦ మీరు ఇప్పుడు సోలార్‌ ప్యానల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ ప్రాసెస్‌లో బ్యాంక్ వివరాలను సమర్పించాలి.

♦ మీరు ఆమోదం పొందిన తర్వాత, మీ డిస్కమ్‌లోని రిజిస్టర్డ్ విక్రేతలలో ఎవరైనా ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

♦ ఇనెట్‌ మీటర్‌ను ఇన్‌స్టాల్‌ చేశాక, డిస్కమ్‌ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్‌ నుంచి కమిషనింగ్‌ సర్టిఫికేట్‌ ఇస్తారు.

 

♦ ఈ రిపోర్ట్‌ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్‌ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్‌ చేయాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.

See also  APPSC Group 2 Hall Ticket 2023 released , download link here