Golden Lizard : కంచిలోని బంగారు, వెండి బల్లుల వెనక అసలు రహస్యం తెలుసా!.


Golden Lizard : మన ఇళ్ళల్లో బల్లులను చూస్తూ ఉంటాం.. వీటిని చూసి చాలా మంది భయపడుతుంటారు. బల్లి మనపై పడిందంటే ఏదోగా అశుభం జరుగుతుందని భావిస్తుంటారు. దానిని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇవి మనం తినే ఆహార పదార్థాలలో పడితే విషంగా మారాతాయని వాటిని తిన్నవారు మరణిస్తారని ప్రజల్లో ప్రచారం కూడా ఉంది. బల్లి మన శరీరంపై పడితే వెంటనే బల్లి శాస్త్రము చూసుకోవటం అలవాటు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని తాకిన వారికి బల్లి వారి శరీరంపై పడినా దుష్పలితం వుండదని అంతా నమ్ముతుంటారు.

అందుకే చాలా మంది కంచి వెళితే బంగారు, వెండి బల్లులను తాకిరావటం మాత్రం మర్చిపోరు. తమిళనాడులోని కాంచీపురం అత్తి వరదరాజ స్వామి ఆలయంలో ఉన్న బంగారు బల్లి విశిష్టత గురించి చాలా మందికి తెలియదు.

అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వసిస్తుంటారు. కంచి బంగారు, వెండి బల్లి గురించి పురాణగాధ ఏం చెబుతున్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్ధాం…

బంగారు వెండి బల్లికి సంబంధించిన గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. నదీ తీరానికి వెళ్లి వారు నీటిని తీసుకువచ్చే సమయంలో వారి కుండలో ఒ బల్లి పడింది. ఈవిషయాన్ని వారు గుర్తించలేదు. అది చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపిస్తాడు. శాపవిముక్తి కల్పించమని ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్ధిస్తారు..కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్య,చంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు.

బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది. బల్లి మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. బల్లి పడినప్పుడు భయపడ కుండా….కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి,మనకు ఇష్టమైన దేవతలకు పూజించటం వల్ల ఆ దోషం పోతుందని శాస్త్రం చెస్తోంది.

కంచిలోని బంగారు బల్లిని తాకటంతో అప్పటివరకూ చేసిన పాపాలు తొలగిపోతాయన్న నమ్మకం భక్తుల్లో ఉంది. వాస్తవానికి బంగారు బల్లులు చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రస్తుతం బంగారు బల్లి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉంది. శేషాచల అడవుల్లో ఎక్కవగా కనిపించే ఈ జీవులు ఇటీవల కాలంలో కనుమరుగై పోతున్నాయి. రాతి గుహలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ బంగారు వర్ణం కలిగిన బల్లులు కనిపిస్తుంటాయి.

See also  గుడిలో శఠగోపం తలపై ఎందుకు పెడతారు ?
,