ఆ ఆలయంలో అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేస్తే చాలు.. అప్పులు తీరిపోతాయంటూ


మనలో చాలామంది నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అప్పుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఒక ఆలయానికి వెళ్లి అమ్మవారికి మొక్కి 16 ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయట.
అప్పులు ఉన్నవాళ్లు నిమిషాంబ దేవి ఆలయాన్ని సందర్శించడం వల్ల అప్పులు తీరిపోతాయట. బోడుప్పల్ లో( Boduppal ) ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరతాయని చాలామంది భావిస్తారు.

నిమిషాంబదేవిని( Nimishamba Devi ) ఏం కోరుకున్నా వేగంగా కోరికలు తీరతాయని భక్తులు చెబుతున్నారు. పెళ్లి కాని వాళ్లు ఈ దేవతను దర్శించుకోవడం వల్ల వేగంగా పెళ్లి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. 2006 సంవత్సరంలో హైదరాబాద్ లో( Hyderabad ) ఈ ఆలయాన్ని నిర్మించారని సమాచారం అందుతోంది. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా హైదరాబాద్ కు చేరుకుని ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

నిమిషంలోగా ఈ ఆలయంలో కోరిక కోరుకోవాలని 21 సెకన్లు, 21 నిమిషాలు, 21 రోజుల్లోగా మన విఘ్నాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. కోరిన కోరికలు తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలని పండితులు వెల్లడిస్తున్నారు. హిందువులలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని( Temple ) దర్శించుకుంటే మంచిది. నిమిషాంబ దేవికి నిమ్మకాయలను సమర్పించి ఆ దండలను ఇంట్లో పెట్టుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.

నిమిషాంబదేవిని దర్శించుకోవడం వల్ల జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో పాటు మంచి ఫలితాలు కలుగుతాయి. నిమిషాంబ దేవికి నిమ్మకాయలు, గాజులు, వస్త్రాలు సమర్పిస్తే మంచిది. గంజాం ప్రదేశంలో నిమిషాంబ దేవి అవతరించారు. భక్తి విశ్వాసాలతో అమ్మవారిని ప్రార్థించడం ద్వారా మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో నిమిషాంబ దేవికి ఆలయాలు ఉండగా దేవి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చు.

See also  Devotional – దేవుడి విగ్రహాలను పూజించేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తే పుణ్యానికి బదులు పాపం వస్తుంది..?
, , ,