“వైయస్ షర్మిల” లవ్ స్టోరీ గురించి తెలుసా..? వీరి ప్రేమ కథ ఎలా మొదలయ్యింది అంటే..?


వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె దివంగత ఏపీ ముఖ్యమంత్రి వై. యస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా సుపరిచితమే. గతంలో వైయస్ జగన్ తరఫున ఎలెక్షన్స్ ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ అంతట పాదయాత్రలో పాల్గొన్న షర్మిల, తర్వాతి కాలంలో తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు.


తెలంగాణలో పాదయాత్రలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోటీ నుండి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయంగా వైఎస్ షర్మిల గురించి తెలిసినా, ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాత్రం కొద్ది మందికే తెలుసు. షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వీరి పరిచయం మరియు లవ్ స్టోరీ గురించి వైఎస్ షర్మిల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వైయస్ షర్మిల చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ తో హైదరాబాదులోని దాభాకు వెళ్ళినపుడు మొదటిసారి బ్రదర్ అనిల్ కుమార్ ని కలిశారట. షర్మిల ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన మీటింగ్ కు అనిల్ కుమార్ కూడా వచ్చారంట. ఆ మీటింగ్ తరువాత అప్పుడప్పుడు ఇద్దరు కలుస్తూ ఉండేవారంట. అనిల్ కుమార్ ముందుగా ప్రపోజ్ చేశారట.


అయితే ఆ సమయంలో అతను క్రైస్తవ మతంలోకి మారలేదు. అనిల్ కుమార్ బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడంతో ఈ పెళ్లికి షర్మిల తండ్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి ముందుగా అంగీకరించలేదట. అతను బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అని, ఇరు కుటుంబాల అలవాట్లు, పద్దతులు వేరు, ఇప్పుడు బాగున్నట్టే ఉంటుంది. కానీ ఆ తరువాత ఉండలేవు అని షర్మిలకి నచ్చ చెప్పారట.
అయినప్పటికీ తాను ఉండగలనని నమ్మకంతో అనిల్ కుమార్ ని వివాహం చేసుకున్నట్లుగా వెల్లడించారు. షర్మిల నాన్ వెజ్ తినడంలో తమకి ఎలాంటి ఇబ్బంది లేదని బ్రదర్ అనిల్ కూడా చెప్పారని, తమ జీవితం సంతోషంగా కొనసాగుతుందని తెలిపారు. తన రాజకీయా జీవితానికి కూడా బ్రదర్ అనిల్ కుమార్ పూర్తిగా సపోర్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

See also  వైసీపీ ప్రభుత్వంపై YS షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ఊహించని రేంజ్‌లో సీరియస్