డాక్టర్లే షాక్ : సైకిల్ గురు.. సైకిల్ యోగి కద్సూర్ గుండెపోటుతో మృతి


అతని పేరు అనిల్ కద్సూర్.. వయస్సు 45 ఏళ్ల మాత్రమే. బెంగళూరు వాసి.. ఇతనికి మరో పేరు కూడా ఉంది.. సైకిల్ గురు, సైకిల్ యోగి, సెంచరీ సైకలిస్ట్.. అవును ఇతను సైకిల్ తొక్కటాన్ని ప్రోత్సహించాడు..
అతను ఆఫీసుకు కూడా సైకిల్ పైనే వెళతాడు.. అన్ని పనులు సైకిల్ ద్వారానే చక్కబెట్టుకుంటాడు. దీని వల్ల ఆరోగ్యంగా ఉన్నానని.. ఆరోగ్యానికి సైకిల్ అనేది చాలా చాలా మంచి చేస్తుందని చెబుతూ ప్రపంచ దృష్టికి ఆకర్షించాడు. ఇప్పటి వరకు అనీల్ కద్సూర్ 2 లక్షల 71 వేల కిలోమీటర్లు సైకిల్ పై తిరిగాడు.. అవును.. అక్షరాల 2 లక్షల 71 వేల కిలోమీటర్లు.. కొన్ని నెలలుగా.. ప్రతి రోజూ 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతున్నాడు.. అలాంటి సైకిల్ గురు గుండెపోటుతో చనిపోయారు.. అది కూడా 45 ఏళ్ల వయస్సులోనే.. ఇప్పుడు ఇదే డాక్టర్ల ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తుంది. ఫిట్ నెస్ ట్రైనర్ గానూ ఎంతో గుర్తింపు పొందారు అనీల్.

నరాల బలానికి, కండరాల బలానికి సైకిల్ తొక్కటం అనేది ఎంతో ఉపయోగం అని.. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందని ఎంతో మంది డాక్టర్లు చెబుతూ వస్తున్నారు. అంతెందుకు ప్రముఖ కార్డియాలజిస్టులు, న్యూరాలిస్టులు రన్నింగ్, వాకింగ్, సైకిలింగ్ చేయటం ద్వారా గుండె సంబంధం వ్యాధుల నుంచి బయటపడొచ్చని.. ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్పటం సహజం.. మరి అలాంటి సైకిలింగ్ ద్వారా ఎంతో బలంగా.. ఆరోగ్యంగా ఉన్న అనీల్ కద్సూర్ గుండెపోటుతో చనిపోవటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

దీనిపై చాలా మంది డాక్టర్లు ఇప్పుడు చెబుతున్నది ఏంటో తెలుసా.. అతి వ్యాయామం కూడా ప్రమాదకరం అని.. ఎక్కువగా సైకిల్ తొక్కటం కూడా ప్రమాదం అని చెబుతున్నారు. ప్రతి రోజూ ఎక్సర్ సైజ్ చేసే వారు.. అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వాలని.. కొన్ని రోజులు వ్యాయామానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అతిగా సైకిలింగ్ చేయటం ద్వారా నిద్రలేమి వస్తుందని.. ఇదే అనీల్ కద్సూర్ మరణానికి కారణం అయ్యి ఉంటుందని కొంత మంది డాక్టర్లు చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా సైకిలింగ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న అనీల్ కద్సూర్ గుండెపోటు మరణం డాక్టర్లను సైతం విస్మయానికి గురి చేసింది.

See also  Rs 500 Note: శ్రీరాముడు, అయోధ్య ఆలయం చిత్రాలతో కొత్త రూ.500 నోట్లు!?
, ,