మీతో మీరే పోటీ పడండి: ఫోన్ వాడకంపై పరీక్షా పే చర్చలో ప్రధాని మోడీ కీలక సూచనలు


#WATCH | Delhi: A lot of parents keep on giving examples of other children to their children. Parents should avoid doing these things… We have also seen that those parents who have not been very successful in their lives, have nothing to say or want to tell the world about their successes, and achievements, make the report card of their children as their visiting card. Whenever they meet someone, they will tell them the story of their children: PM Modi at ‘Pariksha Pe Charcha’ 2024

Watch Video 

న్యూఢిల్లీ: పరీక్షల సమయంలో విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచకూడదని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. సోమవారం జరిగిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కీలక సూచనలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది.
పిల్లలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్​లను వారి విజిటింగ్ కార్డులుగా తల్లిదండ్రులు పరిగణించకూడదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. విద్యార్థులు తమతో తామే పోటీ పడాలని, ఎదుటివారితో కాదని ప్రధాని స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు ప్రతిసారి వారి పిల్లలకు తోటి విద్యార్థుల గురించి ఉదాహరణలు ఇస్తుంటారు. ఎప్పుడూ ఇతరుల గురించి చెబుతుంటారు. దయచేసి తల్లిదండ్రులు ఈ విషయాల నుంచి దూరంగా ఉండాలని ప్రధాని మోడీ సూచించారు. ఇక, విద్యార్థులతో ఉపాధ్యాయుల సంబంధాలు పాఠశాలల్లో తొలి రోజు నుంచి పరీక్షల వరకు కొనసాగాలని మోడీ పేర్కొన్నారు. అప్పుడే విద్యార్థులకు పరీక్షల్లో ఒత్తిడి ఉండదని తెలిపారు.
సిలబస్ వరకే పరిమితం కాకుండా విద్యార్థులతో మమేకం కావడం ముఖ్యమని ప్రధాని మోడీ ఉపాధ్యాయులకు సూచించారు. అప్పుడే విద్యార్థులు తమ చిన్న చిన్న సమస్యలను కూడా ఉపాధ్యాయులతో చెప్పుకోగలుగుతారని అన్నారు. వారి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కారం చూపిస్తేనే విద్యార్థులు పైకి ఎదుగుతారని స్పష్టం చేశారు.
మొబైల్ ఫోన్‌​కు రీఛార్జ్ అవసరమైనట్టే శరీరానికి కూడా రీఛార్జ్ చాలా ముఖ్యమని మోడీ పేర్కొన్నారు. శరీర ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకమన్నారు. ‘పడుకునే సమయాన్ని రీల్స్ చూడటానికి ఉపయోగించకండి. సమయం వృథా చేయకండి. నేను బెడ్​‌పై వాలిపోయిన 30 సెకన్లలోనే నిద్రలోకి జారుకుంటాను. మెలకువగా ఉంటే 100 శాతం ఏకాగ్రతతో పని చేస్తాను అని ప్రధాని మోడీ తెలిపారు. నిద్రతో పాటు పోషకాహారం కూడా చాలా ముఖ్యం. అవసరమైన న్యూట్రిషన్ ఉండే ఆహారం తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఉండాలి అని ప్రధాని మోడీ సూచించారు.

See also  IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ