chanakya niti: జీవితంలో ప్రతిఒక్కరూ తెలుసుకోవలసిన అతిపెద్ద పాఠం.. ఇది తెలిస్తే ఓటమి ఎదురుకాదు!


చాణక్యుడి విధానాలు మెరుగైన జీవితానికి ఎంతో ఉపయోగకరమైవిగా పరిగణిస్తారు. వాటిని అనుసరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కలత చెందడు. అతను కష్ట సమయాల్లోనూ ధైర్యాన్ని వీడడు.
కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి ఒక మార్గాన్ని కనుగొంటాడు. ఇతరులను విజయవంతం చేసేలా ప్రేరేపించేవాడే నిజమైన విజయుడని ఆచార్య చాణక్య తెలిపారు.

సంపదల దేవత లక్ష్మీదేవి కూడా అలాంటి వారికి ప్రసన్నురాలవుతుందని చాణక్య నీతి చెబుతోంది. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. తన లక్ష్యాన్ని కూడా సాధించలేడు.

ఇప్పుడు ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని అమూల్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. చాణక్య విధానం ప్రకారం ఒక వ్యక్తి ఇతరుల తప్పుల నుండి నేర్చుకుంటే, అతను ఎప్పుడూ ఓడిపోడు.

ఎవరిమీద వారు ప్రయోగాలు చేద్దామనుకుంటూ వయసు మీరిపోతుంది తప్ప ప్రయోజనం ఉండదు. మీరు విజయం సాధించాలనుకుంటే, ఇతరుల అనుభవాల నుంచి తెలుసుకోవడానికి వెనుకాడకూడదు.

మనతో సమానమైన స్థితి కలిగిన వారితోనే స్నేహం చేయాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మనకన్నా అధికులు లేదా అల్పులతో స్నేహం ఎక్కువ కాలం నిలవదని చాణక్య తెలిపారు.

పాము, మేక మరియు పులి ఒకదానితో ఒకటి ఎప్పటికీ స్నేహంగా ఉండలేవు. అదేవిధంగా, వ్యతిరేక స్వభావం గల వ్యక్తులతో ఎప్పుడూ స్నేహం చేయకూడదు.

జ్ఞానాన్ని అనేది అమృతాన్ని అందించే ఆ కామధేనువు లాంటిది. అందుకే జ్ఞానం ఎప్పుడు, ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లి స్వీకరించాలని చాణక్యుడు చెప్పాడు. జ్ఞానం ఎప్పుడూ వ్యర్థం కాదు. ‘స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అంటే రాజు అతని రాజ్యంలో మాత్రమే గౌరవం అందుకుంటాడు.

పండితులను, జ్ఞానవంతులను అన్నిచోట్లా గౌరవం అందుకుంటారు. జ్ఞానం అనేది సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి అక్కరకు వచ్చే శక్తి అని చాణక్య తెలిపారు.

మనిషి తన మతాన్ని ఎల్లప్పుడూ సంపద కంటే పైస్థాయిలో ఉంచాలని ఆచార్య చాణక్య తెలిపారు.

See also  Favorite Fruit : మీకు ఇష్టమైన పండును బట్టీ మీ వ్యక్తిత్వం చేప్పేయొచ్చు తెలుసా..?
,