నిరుద్యోగులకు కేంద్రం మరో వరం.. నేడు 1 లక్ష మందికి పైగా లబ్ది


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. లోక్‌సభ ఎన్నికల ముందు.. నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ వికసిత భారత్‌ కార్యక్రమంలో భాగంగా.. దేశవ్యాప్తంగా 1 లక్ష మందికి పైగా అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
ఇలా ప్రభుత్వ ఉద్యోగంలో చేరే యువతకు మోదీ, నియామక పత్రాలు ఇస్తారు. ఇవాళ ఉదయం 10.30కి ఈ కార్యక్రమం జరుగుతుంది. వీడియో కాన్ఫరెన్సింగ్ విధంగాలో మోదీ దీన్ని చేపడతారు. డీడీ న్యూస్ దీనికి లైవ్ ఇస్తుంది.

హైలైట్స్:

ఈ రోజ్ గార్ మేళాలో ఇచ్చే ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటూ, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలూ ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న ఉద్యోగాలే. వీటి ఎంపిక, నియామకాలను పారదర్శకతతో చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఉద్యోగాలు, నియామక ప్రక్రియ అంతా ఆన్‌లైన్ విధానంలో సాగుతుంది. మహిళలు, వికలాంగులకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్నారు. UPSC, SSC, రైల్వే నియామక బోర్డు, IBPS వంటి ఏజెన్సీల ద్వారా నియామకాలు జరుగుతున్నాయి. కర్మయోగి ప్రారంభ మాడ్యూల్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా చేరిన వారికి ఆన్ లైన్ ట్రైనింగ్ కోర్సులను కేంద్రం ఇస్తోంది. ఈ ట్రైనింగ్ ను https://igotkarmayogibharat.gov.in ద్వారా పొందవచ్చు.

రోజ్ గార్ మేళా ద్వారా అటు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు, ఇటు ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులూ ఒక్కటవుతున్నారు. ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇవి చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం కేంద్రం ప్రత్యేక బూత్ లను ఏర్పాటు చేస్తోంది. అక్కడికి వెళ్లే నిరుద్యోగులకు అక్కడే, కంపెనీలు బ్రోచర్లు ఇస్తున్నాయి. ఆ బ్రోచర్లతో నిరుద్యోగులు ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు. అలా ఉద్యోగుల ఎంపిక జరుగుతోంది.

రోజ్ గార్ మేళాలో ఒక్కో బూత్‌లో 5 నుంచి 100 కంపెనీలు పాల్గొంటున్నాయి. వందల మంది నిరుద్యోగులు వస్తున్నారు. వారు ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత, ప్రధాని మోదీ వారికి ఆన్ లైన్ విధానంలో నియామక పత్రాలు ఇస్తున్నారు.
ఇలా ఇప్పటివరకూ కేంద్రం 1524 రోజ్ గార్ మేళాలను నిర్వహించింది. వాటిలో 5,61,948 మంది రిజిస్టర్ చేయించుకున్నారు. వారిలో 2,48,596 మంది సెలెక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో 38 రోజ్ గార్ మేళాలు జరగగా, తెలంగాణలో 35 జరిగాయి.

See also  Shrestha Thakur | పోలీస్‌ అధికారిణిని బురిడీ కొట్టించిన వ్యక్తి.. ఐఆర్‌ఎస్‌ అధికారిగా నమ్మించి పెళ్లాడాడు