CBSE : 9వ తరగతి పుస్తకాల్లో డేటింగ్ , రిలేషన్ షిప్ పాఠాలు


ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకు డేటింగ్ , లవ్ , లస్ట్ ఈ పదాలను కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రపంచం చాలా ముందుకు వెళ్లిపోయింది.
మీరు చిన్నపిల్లలు అనుకునే మీ పిల్లలు ఇక చిన్నవారు కాదు. వారికి తెలియాల్సిన టైం వచ్చింది. చాలా రిలేషన్స్ అవగాహన లేకపోవడం వల్లే విడిపోతున్నాయి. చాలా తప్పులు వయసు ప్రభావం తో చేసే వాటివల్లే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-సీబీఎస్ఈ సరికొత్త విధానాన్ని అవలంభిస్తోంది.

అయితే ఈ పాఠ్యాంశాన్ని 9 వ తరగతి విద్యార్థులకు సంబంధించిన వ్యాల్యూ ఎడ్యుకేషన్( VALUE EDUCATION) పుస్తకాల్లో ఉంచింది. ఈ పాఠాలను మొత్తం డేటింగ్, రిలేషన్‌షిప్‌కు సంబంధించిన చిన్న చిన్న విషయాలను చర్చించేందుకు తయారు చేశారు. ఇందులో గోస్టింగ్, క్యాట్ ఫిషింగ్, సైబర్ బెదిరింపులు వంటి వాటిని వివరించేలా ఉన్నాయి.
అయితే ఈ పుస్తకాల్లోని పాఠ్యాంశానికి సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్ ట్విటర్‌లో పంచుకోవడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి ఇది చాలా మంచి విషయం . కాస్తో కూస్తో అవగాహన కల్పించడం చాలా హర్షించే విషయం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు . దీనిపై ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్ అయిన టిండర్ ( TINDER) ఇండియా ట్విటర్‌లో స్పందించింది. ఇక తర్వాతి పాఠం బ్రేకప్‌ల గురించి ఉంటుందేమో అని పేర్కొంది.

టీనేజీ దశలో ప్రేమల కారణంగా సూసైడ్‌లు, డిప్రెషన్‌లోకి వెళ్లడం, మత్తు పదార్థాలకు బానిక కావడం వంటివి జరుగుతున్నాయని.. వాటిని అరికట్టేందుకు ఇలాంటి పాఠ్యాంశాలు చాలా అవసరమని పేర్కొన్నారు. సీబీఎస్సీ ఈ పాఠ్యాంశాన్ని చేర్చడం పిల్లలకు చాలా మంచి చేసే ప్రయత్నమే అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

See also  ఏపీలో కొత్తగా 3 ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు !