BREAKING: EAPCET (TS ఎంసెట్) షెడ్యూల్ విడుదల..


TS EAPCET-2024 (TS ఎంసెట్) నోటిఫికేషన్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇవాళ వెల్లడించింది. ఈ మేరకు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఆ దరఖాస్తులను కూడా ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని స్పష్టం చేశారు. మే 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, ఈసారి ఎంసెట్ ప్రవేశ పరీక్ష పేరును మారుస్తూ.. ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది.

గతంలో ఇంజినీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలకు ఎంసెట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేసే వారు. కానీ, ప్రస్తుతం మెడిసిన్, డెంటల్, యునానీ, ఆయుర్వేద, హోమియో కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ను నిర్వహిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ స్థాయిలో ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మెడిసిన్(ఎం) అనే పదాన్ని ఎంసెట్ నుంచి తొలగించింది. దీంతో ఎంసెట్ కు బదులు ఎప్‌సెట్‌గా మారనుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు మాత్రమే నిర్వహించే పరీక్ష కావడంతో ఎప్‌సెట్(టీఎస్ ఈఏపీసీఈటీ)గా పేరు ఖరారు చేశారు

See also  RBI : గుడ్ న్యూస్..బ్యాంకు లలో loans తీసుకొనే వారికి శుభవార్త చెప్పిన రిజర్వ్ బ్యాంకు
, ,