Big TV Syrvay – Ongole Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. ఒంగోలు ఓటరు పట్టం కట్టేదెవరికి ?


ఏపీ రాజకీయాల్లో ఒంగోలుకు ప్రత్యేక స్థానం ఉంది. ఒంగోలు కోట, చెన్నకేశవస్వామి దేవాలయం, రంగరాయుడు చెరువు, పల్లవ, శాతవాహన రాజ్యాల గుర్తులు… ఒక్కటేమిటి చరిత్ర చూస్తే బాగానే ఉంది.
అదే సమయంలో ఈ ప్రాంత రాజకీయ చైతన్యానికి కూడా పెట్టింది పేరు. ఈ ఒంగోలు సెగ్మెంట్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొన్ని దశాబ్దాలుగా బలమైన నేతగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఏడో సారి బరిలో నిలిచినట్లయింది. ఒకసారి మాత్రమే ఓడిపోయారు. ఐదుసార్లు గెలిచారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని ఒంగోలు నుంచి పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అటు టీడీపీ అభ్యర్థి కూడా దామచర్ల జనార్ధన రావు కూడా రేసులోకి దూసుకొచ్చారు. ఒంగోలు సిటీ పొగాకు వ్యాపారానికి కేంద్రంగా ఉంది. ఒంగోలు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.

2019 RESULTS

బాలినేని శ్రీనివాసరెడ్డి VS దామచర్ల జనార్ధనరావు

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి 52 శాతం ఓట్లు రాబట్టి ఘన విజయం సాధించారు. అలాగే టీడీపీ నుంచి పోటీ చేసిన దామచర్ల జనార్ధనరావు 41 శాతం మరి ఈసారి ఎన్నికల్లో ఒంగోలు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

బాలినేని శ్రీనివాసరెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

నియోజకవర్గంలో పేరున్న నాయకుడు

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం
సీఎం జగన్ తో బంధుత్వం

పార్టీ కార్యకర్తలతో మంచి సత్సంబంధాలు

బాలినేని శ్రీనివాసరెడ్డి మైనస్ పాయింట్స్

నియోజకవర్గం అనుకున్నంత అభివృద్ధి చెందకపోవడం

గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి ఒంగోలుకు తాగునీరు రాకపోవడం

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో తాగునీటి సమస్య

వాటర్ ట్యాంకర్లపైనే ఇప్పటికీ ఆధారపడడం

ఒంగోలులో గంజాయి మాఫియాకు చెక్ పెట్టకపోవడం

దామచర్ల జనార్ధనరావు (TDP) ప్లస్ పాయింట్స్

గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి

ఓడినా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉండడం

ప్రజల్లో దామచర్లకు మంచి ఇమేజ్

దామచర్ల హయాంలో జరిగిన అభివృద్ధి

గ్రౌండ్ లో యాక్టివిటీస్ మరింతగా పెంచడం

టీడీపీ, జనసేన పొత్తుతో మరింత ప్లస్

ఇక వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

బాలినేని శ్రీనివాసరెడ్డి VS దామచర్ల జనార్ధనరావు

ఇప్పటికిప్పుడు ఒంగోలులో ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధనరావుకు 49 శాతం ఓట్లు, బాలినేని శ్రీనివాసరెడ్డికి 46 శాతం ఓట్లు, ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని సర్వేలో వెల్లడైంది. అయితే టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సెగ్మెంట్ లో ఓటర్లు చెబుతున్న దాని ప్రకారం టీడీపీ అభ్యర్థి జనార్ధన్ రావుకు పాజిటివ్ వేవ్ కనిపిస్తోంది. పబ్లిక్ లో ఇమేజ్ పెంచుకున్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అనుకున్నంతగా అభివృద్ధి జరగకపోవడం అధికార పార్టీకి మైనస్ గా చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కలిసి వస్తోంది. దామచర్ల జనార్థన్ రావు కమ్మ సామాజికవర్గం నేత. అటు జనసేనతో పొత్తు కారణంగా కాపు ఓటర్ల మద్దతు కూడా భారీగానే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వీటితో పాటే ప్రభుత్వ సహజ వ్యతిరేకత కూడా ప్రతిపక్ష అభ్యర్థికి ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా సీనియర్ మోస్ట్ లీడర్. స్ట్రాంగ్ పొలిటికల్ ప్రొఫైల్ కూడా ఉంది. తనకంటూ సపరేట్ ఓట్ బ్యాంక్ ను సృష్టించుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వ స్కీముల లబ్దిదారుల ఓట్లపై వైసీపీ నమ్మకం పెట్టుకుంటోంది.

See also  బాలినేని కి వైసీపీ షాక్ – సీఎం జగన్ – సజ్జలపై బాలినేని ఫైర్