Big Breaking: వైసీపీకి మరో బిగ్ షాక్.. మచిలీపట్నం ఎంపీ రాజీనామా


వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన మచిలీపట్నం నుంచి ఎంపీగా ఉన్నారు. వైసీపీ ఇంఛార్జుల మార్పులతో మరోసారి సీటు దక్కడం కష్టమని భావించిన ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఎంపీ బాలశౌలి వైఎస్ జగన్‌కు సన్నిహితుడు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని సీఎం జగన్ స్పష్టత ఇవ్వకపోవడంతో బాలశౌలి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లో వైసీపీ నాలుగో లిస్టు విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే ఎంపీ బాలశౌరి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

ఇప్పటికే ఆరుగురు ఎంపీ అభ్యర్థులను వైసీసీ అధిష్టానం ఖరారు చేసింది. ఎంపీ బాలశౌరి రాజీనామాతో ఆ స్థానంలో ఎవరి పేరు ఉండబోతుందో చూడాలి. మరోవైపు ఎంపీ బాలశౌరి రాజీనామాతో మచిలీపట్నం వైసీపీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

See also  TANA 2024 elections : తానా ఎన్నికల్లో కొడాలి టీం విజయం..