🔫భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తర్వాత ఎలా దొరికింది? ఇప్పుడు ఎక్కడ ఉంది…??


Bhagat Singh’s pistol to be displayed at Hussainiwala border museum in Punjab
స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు, అమ‌ర‌వీరుడు భ‌గ‌త్ సింగ్ అంటే మ‌న దేశంలో తెలియ‌ని వారుండ‌రు. యుక్త వ‌య‌స్సులోనే విప్ల‌వోద్య‌మాల బాట ప‌ట్టిన వీరుడత‌ను. భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ఎన్నో ఉద్య‌మాల‌ను ఆయ‌న న‌డిపారు. ఓ బ్రిటిష్ అధికారిని తుపాకితో కాల్చి చంపినందుకు గాను ఆయ‌న‌కు బ్రిటిష్ ప్ర‌భుత్వం మ‌ర‌ణ దండ‌న విధించింది. దీంతో చాలా చిన్న వ‌య‌స్సులోనే అత‌ను మృతి చెందాడు. అయితే భ‌గ‌త్‌సింగ్‌కు చెందిన తుపాకి ఒక‌టి ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. దాన్ని మ‌న దేశంలోనే ఓ మ్యూజియంలో భ‌ద్రంగా ఉంచారు. భార‌తదేశ స్వాతంత్ర్య ఉద్య‌మం తీవ్రంగా జ‌రుగుతున్న రోజుల‌వి. 1928లో భారత్‌లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సభ్యుడిగా ఒక్క భారతీయుడిని కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబరు 1928న కమిషన్ లాహోర్‌‌ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలా లజ్‌పత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది.

అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు. లాలా లజ్‌పత్ రాయ్‌ ఛాతీపై పోలీసులు లాఠీలతో కొట్టారు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే బ్రిటిష్‌ పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్, సుఖ్‌దేవ్ థాపర్‌లతో భ‌గ‌త్‌సింగ్‌ చేతులు కలిపాడు. స్కాట్‌ను గుర్తించిన జై గోపాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా స్కాట్‌కు బ‌దులుగా భ‌గ‌త్‌సింగ్ జాన్ శాండ‌ర్స్ ను కాల్చి చంపాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగింది 1928 డిసెంబర్‌ 17న. కాగా జాన్ శాండ‌ర్స్‌ను కాల్చి చంపిన తుపాకి సీరియ‌ల్ నంబ‌ర్ 168896. అది 32ఎంఎం కోల్ట్‌ ఆటోమేటిక్‌ పిస్టల్‌. అయితే మొద‌ట ఈ తుపాకిని బీఎస్‌ఎఫ్‌ సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ విపన్స్‌, టాక్టిక్స్ (సీడబ్ల్యూఎస్‌టీ)లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు. కాగా ఈ మ‌ధ్యే దానిపై పేరుకుపోయిన దుమ్ము, న‌లుపు రంగును తుడిచి వేయ‌గా దానిపై ఉన్న సీరియ‌ల్ క‌నిపించింది. దీంతో ఆ తుపాకిని భ‌గ‌త్‌సింగ్ వాడిన తుపాకిగా గుర్తించారు. తరువాత ఈ తుపాకి బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఇండోర్‌ మ్యూజియంలో కొంత కాలం ఉంది. “తర్వాత ఆ పిస్టల్‌ను పంజాబ్ ఎలా తీసుకెళ్లాలా అనే సమస్య ఎదురైంది” “పిస్టల్ పత్రాల ఆధారంగా పంజాబ్, హర్యానా హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు.అందులో పిస్టల్‌పై అసలు హక్కు పంజాబ్‌కే దక్కుతుందని ,అందుకే దీన్ని పంజాబ్‌ స్వాధీనం చేయాలని కోరారు.” ఈ పిస్టల్‌ను ఇప్పుడు పంజాబ్‌లోని హుస్సేనీవాలా మ్యూజియంలో భద్రపరిచారు. హుస్సేనీవాలా సరిహద్దు దగ్గరకు ప్రతి రోజూ జనం భారీ సంఖ్యలో వస్తుంటారు. వారందరూ దాన్ని చూడాలనే భగత్ సింగ్ స్వగ్రామం ఖట్‌కర్ కలాన్‌ మ్యూజియంలో ఈ పిస్టల్‌ను పెట్టలేదు. అమెరికాలో తయారైన ఈ పిస్టల్ భగత్ సింగ్‌కు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారనే ఆధారాలు లభించలేదు…

See also  Car Tires: కారు టైర్లలో సాధారణ గాలికంటే నైట్రోజన్‌ గాలితో ప్రయోజనాలు ఏంటి?

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు, అమ‌ర‌వీరుడు భ‌గ‌త్ సింగ్ అంటే మ‌న దేశంలో తెలియ‌ని వారుండ‌రు. యుక్త వ‌య‌స్సులోనే విప్ల‌వోద్య‌మాల బాట ప‌ట్టిన వీరుడత‌ను. భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ఎన్నో ఉద్య‌మాల‌ను ఆయ‌న న‌డిపారు. ఓ బ్రిటిష్ అధికారిని తుపాకితో కాల్చి చంపినందుకు గాను ఆయ‌న‌కు బ్రిటిష్ ప్ర‌భుత్వం మ‌ర‌ణ దండ‌న విధించింది. దీంతో చాలా చిన్న వ‌య‌స్సులోనే అత‌ను మృతి చెందాడు. అయితే భ‌గ‌త్‌సింగ్‌కు చెందిన తుపాకి ఒక‌టి ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. దాన్ని మ‌న దేశంలోనే ఓ మ్యూజియంలో భ‌ద్రంగా ఉంచారు.
భార‌తదేశ స్వాతంత్ర్య ఉద్య‌మం తీవ్రంగా జ‌రుగుతున్న రోజుల‌వి. 1928లో భారత్‌లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సభ్యుడిగా ఒక్క భారతీయుడిని కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబరు 1928న కమిషన్ లాహోర్‌‌ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలా లజ్‌పత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు. లాలా లజ్‌పత్ రాయ్‌ ఛాతీపై పోలీసులు లాఠీలతో కొట్టారు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.


అందులో భాగంగానే బ్రిటిష్‌ పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్, సుఖ్‌దేవ్ థాపర్‌లతో భ‌గ‌త్‌సింగ్‌ చేతులు కలిపాడు. స్కాట్‌ను గుర్తించిన జై గోపాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా స్కాట్‌కు బ‌దులుగా భ‌గ‌త్‌సింగ్ జాన్ శాండ‌ర్స్ ను కాల్చి చంపాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగింది 1928 డిసెంబర్‌ 17న. కాగా జాన్ శాండ‌ర్స్‌ను కాల్చి చంపిన తుపాకి సీరియ‌ల్ నంబ‌ర్ 168896. అది 32ఎంఎం కోల్ట్‌ ఆటోమేటిక్‌ పిస్టల్‌. అయితే మొద‌ట ఈ తుపాకిని బీఎస్‌ఎఫ్‌ సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ విపన్స్‌, టాక్టిక్స్ (సీడబ్ల్యూఎస్‌టీ)లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు. కాగా ఈ మ‌ధ్యే దానిపై పేరుకుపోయిన దుమ్ము, న‌లుపు రంగును తుడిచి వేయ‌గా దానిపై ఉన్న సీరియ‌ల్ క‌నిపించింది. దీంతో ఆ తుపాకిని భ‌గ‌త్‌సింగ్ వాడిన తుపాకిగా గుర్తించారు. తరువాత ఈ తుపాకి బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఇండోర్‌ మ్యూజియంలో కొంత కాలం ఉంది.

“తర్వాత ఆ పిస్టల్‌ను పంజాబ్ ఎలా తీసుకెళ్లాలా అనే సమస్య ఎదురైంది”
“పిస్టల్ పత్రాల ఆధారంగా పంజాబ్, హర్యానా హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు.అందులో పిస్టల్‌పై అసలు హక్కు పంజాబ్‌కే దక్కుతుందని ,అందుకే దీన్ని పంజాబ్‌ స్వాధీనం చేయాలని కోరారు.” ఈ పిస్టల్‌ను ఇప్పుడు పంజాబ్‌లోని హుస్సేనీవాలా మ్యూజియంలో భద్రపరిచారు.
హుస్సేనీవాలా సరిహద్దు దగ్గరకు ప్రతి రోజూ జనం భారీ సంఖ్యలో వస్తుంటారు. వారందరూ దాన్ని చూడాలనే భగత్ సింగ్ స్వగ్రామం ఖట్‌కర్ కలాన్‌ మ్యూజియంలో ఈ పిస్టల్‌ను పెట్టలేదు.

See also  Cockroaches : ఈ చిట్కాతో.. మీ ఇంట్లో ఉండే బొద్దింకలు, దోమలు, ఈగలను తరిమేయండిలా..!Cockroaches : ఈ చిట్కాతో.. మీ ఇంట్లో ఉండే బొద్దింకలు, దోమలు, ఈగలను తరిమేయండిలా..!

అమెరికాలో తయారైన ఈ పిస్టల్ భగత్ సింగ్‌కు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారనే ఆధారాలు లభించలేదు…

, ,