BEL Job Recruitment: ఇంజినీరింగ్‌ డిప్లొమాతో బెల్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?


BEL Job Recruitment | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL)లో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.
మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమాతో పాటు ఐటీఐ అర్హతతో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ ట్రైనీ, ఐటీఐ అర్హతతో టెక్నీషియన్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ముగుస్తోంది. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ యూనిట్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలు..

మొత్తం 46 ఉద్యోగాలు కాగా.. వీటిలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ అండ్‌ టెక్నీషియన్‌ పోస్టులు 22 కాగా.. టెక్నీషియన్‌ ఉద్యోగాలు 24. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌కు మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా అర్హత. టెక్నీషియన్‌ పోస్టులకు ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ చేసిన వారు అర్హులు.
వయె పరిమితి : 2024 జనవరి 1 నాటికి 28 ఏళ్లు మించరాదు. ఆయా వర్గాల వారీగా వయో సడలింపు అవకాశం ఉంటుంది.
వేతనం: ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ అండ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు వేతనం: రూ. 24,500- రూ.90,000; టెక్నీషియన్‌ రూ.21,500 నుంచి రూ.82,000
దరఖాస్తు రుసుం రూ.295 (జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఎలాంటి రుసుం లేదు.
రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది.

See also  BPNL 2024: నెలకి 25 వేల జీతం తో BPNL లో 1884 ఉద్యోగాలు .. వివరాలు ఇవే..